Share News

‘సుప్రీంకోర్టు ఆదేశాలతోనే సదస్సులు’

ABN , Publish Date - Feb 16 , 2026 | 11:45 PM

సుప్రీం కోర్టు ఆదేశాల మేరకే గ్రామాలలో న్యాయ అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తున్నట్టు కొత్తవలస కోర్టు న్యాయాధికారి సముద్రాల విజయ్‌చందర్‌ అన్నారు.

‘సుప్రీంకోర్టు ఆదేశాలతోనే సదస్సులు’
మాట్లాడుతున్న న్యాయాధికారి విజయ్‌చందర్‌

కొత్తవలస, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): సుప్రీం కోర్టు ఆదేశాల మేరకే గ్రామాలలో న్యాయ అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తున్నట్టు కొత్తవలస కోర్టు న్యాయాధికారి సముద్రాల విజయ్‌చందర్‌ అన్నారు. సోమవారం రామలింగపురం గ్రామంలో ఆయన అధ్యక్షతన న్యాయ అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 14న జరిగే లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. చిన్న చిన్న సమస్యలకు కోర్టులను ఆశ్రయించడం మంచిది కాదన్నారు. రాజీకి వీలు పడే కేసులను లోక్‌అదాలత్‌లలో పరిష్కరించుకోవడం ఉత్తమమన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు.

సద్వినియోగం చేసుకోవాలి

గజపతినగరం, ఫిబ్రవరి 16(ఆంధ్ర జ్యోతి): క్ష ణికావేశంలో చేసిన తప్పులను సరిదిద్దుకొనేందుకు అవకాశం కల్పిస్తున్న లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకో వాలని న్యాయాధికారి ఎ.విజయ్‌ రాజ్‌కుమార్‌ అన్నారు. సోమవారం స్థానిక కోర్టు ఆవరణలో పోలీస్‌శాఖ అధికారులు, న్యాయ వాదులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చెనెల 14న నిర్వహించనున్న జాతీయ మెగా లోక్‌ అదాలత్‌లో కేసులు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కేసులు వాయిదాలు లేకుండా చూడాలని సూచించారు. ఈ సమావేశంలో న్యాయవాదులు రమేష్‌ రాజు, రెడ్డి శ్రీనివాసులనాయుడు, చప్పా తిరుపతిరావు, కలిశెట్టి రామునాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 16 , 2026 | 11:45 PM