Share News

సీఎం సహాయనిధి పేదలకు వరం

ABN , Publish Date - Feb 16 , 2026 | 11:52 PM

ఆభాగ్యులకు అండగా సీఎం సహాయనిధి నిలుస్తుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు.

సీఎం సహాయనిధి పేదలకు వరం
లబ్ధిదారులతో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి

  • ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి

నరసన్నపేట, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): ఆభాగ్యులకు అండగా సీఎం సహాయనిధి నిలుస్తుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. సోమవారం కత్తిరివానిపేటలోని తన క్యాంపు కార్యాలయంలో నాలుగు మండలాలకు చెందిన లబ్ధిదారుకుల రూ.21 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, ఆరోగ్యంపై పూర్తి భరోసా కల్పిస్తున్నారన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేదలకు అండగా నిలుస్తున్నారన్నారు. అనంతరం కార్యాలయంలో ప్రజా దర్బార్‌ నిర్వహించి పలు వినతులను స్వీకరించారు. కార్యక్రమంలో నాలుగు మండలాలకు చెందిన కూటమి నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Feb 16 , 2026 | 11:52 PM