Share News

తడి, పొడి చెత్తను సేకరించాలి

ABN , Publish Date - Feb 16 , 2026 | 11:52 PM

ప్రతి ఇంటికీ పారిశుధ్య సిబ్బంది వెళ్లి తడి, పొడి చెత్తను సేకరించాలని విశాఖ రీజనల్‌ మునిసిపల్‌ ప్రాంతీయ సంచాలకుడు వి.రవీంద్ర ఆదేశించారు.

తడి, పొడి చెత్తను సేకరించాలి
సాలూరు డంపింగ్‌ యార్డులో పర్యటిస్తున్న ఆర్‌డీఎంఏ రవీంద్ర

- ఆర్‌డీఎంఏ రవీంద్ర

సాలూరు, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): ప్రతి ఇంటికీ పారిశుధ్య సిబ్బంది వెళ్లి తడి, పొడి చెత్తను సేకరించాలని విశాఖ రీజనల్‌ మునిసిపల్‌ ప్రాంతీయ సంచాలకుడు వి.రవీంద్ర ఆదేశించారు. సోమవారం సాలూరు మునిసిపాలిటీ పరిధిలో ఉన్న డంపింగ్‌ యార్డును ఆయన పరిశీలించారు. ఇక్కడ తయారవుతున్న వర్మీ కంపోస్టును, రాబిడ్‌ డాగ్స్‌ భద్రపరిచే గదిని పరిశీలించారు. తడి, పొడి చెత్త సేకరణ గురించి కమిషనర్‌ టీటీ రత్నకుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వచ్ఛ సర్వేక్షణ్‌ ప్రమాణాల ప్రకారం వ్యర్థాల నిర్వహణ సరిగ్గా జరుగుతుందో లేదో తెలుసుకునేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు. ప్రభుత్వం డంపింగ్‌ యార్డు రహిత రాష్ట్రంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుందని, దాన్ని దృష్టిలో పెట్టుకుని క్షేత్రస్థాయిలో పారిశుధ్య పనులు నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఈ ప్రసాద్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ ఎల్‌.బాలకృష్ణ, ఏఈ అళికేష్‌స్వామి, శానిటరీ సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.

Updated Date - Feb 16 , 2026 | 11:52 PM