ఉత్తరాంధ్ర ప్రజలకు జగన్ క్షమాపణలు చెప్పాలని రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. విశాఖ కేంద్రంగా రాజధాని ఏర్పాటు చేస్తానని చెప్పి మాట తప్పాడన్నారు.
మాదక ద్రవ్యాలు పొరల్లో దాచినా గుర్తించే సామర్థ్యం ఏపీ పోలీసు శాఖలోని జాగిలాలకు ఉందని హోంమంత్రి అనిత తెలిపారు. పేలుడు పదార్థాల గుర్తింపు నుంచి సంచలన కేసుల్లో ఆధారాలను పసిగట్టడంలో మన పోలీసు జాగిలాల ట్రాక్ అద్భుతంగా ఉందన్నారు.
వినాయక ఊరేగింపు సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కాకరపర్రులో రూ.5 లక్షల విలువైన పూలతో ఊరేగింపు వాహనాన్ని అలంకరించారు.
ఎండలకు మార్కాపురం జిల్లా కంభం నిప్పులకొలిమిలా మారింది. ఎల్‌నినో ప్రభావంతో గత నాలుగు రోజులుగా కంభంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. బుధవారం 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది
కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వశాఖకు అనుబంధంగా ఉన్న ఎన్‌ఎండీఎఫ్‌సీ(నేషనల్ మైనార్టీస్ డెవల్‌పమెంట్ అండ్ ఫైనాన్స్ కార్పొరేషన్) ఆధ్వర్యంలో అక్టోబరు 8వ తేదీన మైనార్టీల కోసం ’ రిఫార్మ్ ఉత్సవ్’ భారీ ఎత్తున నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ తెలిపారు.
శ్రీశైలం క్షేత్రానికి వెళ్లే భక్తులకు దోర్నాల చెక్ పోస్టు వద్ద కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది.
‘తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దేవుళ్లలో కూడా ‘పేద దేవుడు, ధనవంతుడైన దేవుడు’ అంటూ కొత్త నిర్వచనాలు తీసుకొచ్చారు. నిద్రలో కూడా ధనం పైనే ధ్యాస ఉండే వారికి, కాంగ్రెస్ పార్టీకి అంతా అలాగే కనిపిస్తుంది’
ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో తీర్పును సీఐడీ కోర్టు అక్టోబరు 7వ తేదీకి వాయిదా వేసింది. జెత్వానీ తప్ప ఆమె తల్లిదండ్రులు, సోదరుడిని ఈ కేసు నుంచి తొలగిస్తామని సీఐడీ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మద్యం రవాణా టెండర్లలో అక్రమాల కేసులో వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును కోర్టు అక్టోబరు 5 నుంచి 9వ తేదీ వరకు సిట్ కస్టడీకి అప్పగించింది.
మాజీ మంత్రి జోగి రమేశ్ కుటుంబం నుంచి తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆయన కోడలు జోగి మేఘన భయాందోళన వ్యక్తం చేశారు. తమకు రక్షణ కల్పించాలని కోరుతూ..