నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో ఒకేసారి రూ.17కోట్లతో చేపట్టిన 168 అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సోమవారం ప్రారంభించారు.
వైసీపీ గొడ్డలి పార్టీ అని.. అందులోని వారంతా సైకోల్లా వ్యవహరిస్తున్నారని ఏపీ మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి పి. నారాయణ మండిపడ్డారు. కోర్టులు మొట్టికాయలు వేసినా.. వారి తీరు మారడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు.
దేశ సరిహద్దుల్లో విధులు నిర్వర్తించే ఓ ఆర్మీ జవాన్ స్వగ్రామానికి వస్తూ అదృశ్యమవడం కలకలం రేపుతోంది. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలోని తోటల చెరువుపల్లికి చెందిన పగడాల రవి 19 రోజులుగా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.
మంత్రి నారాయణను క్రెడాయ్ ఏపీ ప్రతినిధులు మంగళవారం కలిశారు. మంత్రికి అభినందనలు తెలిపి సన్మానించారు.
సీఎం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. ప్రతి కుటుంబం ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.
నాయుడుపేట స్వర్ణముఖినది వంతెనపై మరమ్మతులతో పలు మెము రైళ్లు రద్దు కాగా ఎక్స్‌ప్రెస్ రైళ్లు కొంత ఆలస్యంగా నడిచాయి.
చదువుతో పేదరికాన్ని జయించవచ్చని మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. తాను ట్యూషన్స్ ప్రారంభించి కష్టపడి ఈ స్థాయికి వచ్చానని పేర్కొన్నారు.
నెల్లూరు జిల్లా కావలి మండలం తాగేటివారిపాలెంలో టీడీపీ కార్యకర్త చాట్ల వాసు హత్య రాజకీయంగా కలకలం రేపింది. ఇటీవల జరిగిన ఘర్షణలో తీవ్రంగా గాయపడిన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం సీనియర్ నేత, మాజీమంత్రి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమను జగన్ ముంచేశారని ధ్వజమెత్తారు.
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిపై టీడీపీ నేత, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రశేఖర్ ఏం చెబితే అదే కాకాణి మాట్లాడుతున్నారన్నారు.