Nellore Fire Accident: నెల్లూరు హోటల్లో భారీ అగ్ని ప్రమాదం..
ABN , Publish Date - Oct 12 , 2025 | 09:45 AM
నగరంలోని బ్లూ మూన్ హోటల్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే హోటల్ యాజమాన్యం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
నెల్లూరు: నగరంలోని బ్లూ మూన్ హోటల్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే హోటల్ యాజమాన్యం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. అనంతరం హోటల్లో చిక్కుకున్న 30 మందిని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా కాపాడారు.
సమాచారం మేరకు ఘటనా స్థలాన్ని ఎస్పీ అజిత వెజెండ్ల పరిశీలించారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం సంభవించి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం.. ఎవరికి గాయాలు కాలేవని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏస్పీ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
Indigo Flight: విమానంలో పగిలిన అద్దం.. 76 మందికి తప్పిన ముప్పు
Massive Explosion: బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు