Share News

Kotamreddy Criticizes Jagan: బాలయ్య పేరు ఎత్తే అర్హత నీకుందా?.. జగన్‌పై నుడా చైర్మన్ ఫైర్

ABN , Publish Date - Oct 24 , 2025 | 01:45 PM

చంద్రబాబును ఎదుర్కోలేక, అభివృద్ధి పనులు చూసి ఓర్చుకోలేక.. బాలకృష్ణను తాగుబోతు అని జగన్ విమర్శలు చేశారని కోటంరెడ్డి మండిపడ్డారు.

Kotamreddy Criticizes Jagan: బాలయ్య పేరు ఎత్తే అర్హత నీకుందా?.. జగన్‌పై నుడా చైర్మన్ ఫైర్
Kotamreddy Criticizes Jagan

నెల్లూరు, అక్టోబర్ 24: మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి (Nuda Chairman Kotam Reddy Srinivasulu Reddy) తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు జగన్ తీరు ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. తాగి అసెంబ్లీకి వచ్చారని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను విమర్శలు చేశాడు సైకో జగన్ అంటూ మండిపడ్డారు. దీన్ని బట్టి జగన్ మానసిక పరిస్థితి బాగోలేదని అర్ధం అవుతోందన్నారు. బాలకృష్ణ అభిమానిని అని గతంలో చెప్పిన జగన్.. ఇప్పుడు రాజకీయాల్లో నిలబడలేక ఇటువంటి అబద్ధపు విమర్శలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. చంద్రబాబును ఎదుర్కోలేక, అభివృద్ధి పనులు చూసి ఓర్చుకోలేక.. బాలకృష్ణను తాగుబోతు అని విమర్శలు చేశారని మండిపడ్డారు.


బ్రాండ్ ఇమేజ్ ఉన్న నాయకుడు బాలయ్య అని.. బాలకృష్ణ పేరు ఎత్తే అర్హత జగన్‌కు లేదన్నారు. అవినీతి మచ్చలేని నాయకుడు బాలకృష్ణ అని పేర్కొన్నారు. వేలాది మంది పేద ప్రజలకు జగన్ బ్రాండ్ మందు తాగించారని ఆరోపించారు. పేదల కుటుంబాల్లో చీకట్లు నింపారని... ఆ డబ్బు ఏమి చేసుకుంటారంటూ జగన్‌ను ప్రశ్నించారు.


అమెరికా తరువాత భారత దేశానికి వచ్చిన గూగుల్ సంస్థను కూడా విమర్శిస్తున్నారంటూ మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు జగన్ ఒక్క కంపెనీ కూడా తీసుకురాలేదన్నారు. సైకోలా జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు కలిసి రాష్ట్రంలో అధికారం చెలాయించారని విమర్శించారు. దాచుకోవడం, దోచుకోవడం, తినుకోవడమే జగన్ పాలన తీరన్నారు. జగన్ మానసిక తీరు బాగోలేదని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి వ్యాఖ్యలు చేశారు.


ఇవి కూడా చదవండి...

కర్నూలు ప్రమాదం... ట్రావెల్స్ సంస్థలపై రామచందర్ రావు సీరియస్

సీఐఐ సదస్సుకు రండి.. పారిశ్రామికవేత్తలకు లోకేష్ ఆహ్వానం

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 24 , 2025 | 04:51 PM