Share News

Nellore Penna River: సంగం పెన్నా వారధి వద్ద తప్పిన పెను ప్రమాదం..

ABN , Publish Date - Oct 29 , 2025 | 08:39 AM

ఏపీలో మొంథా తుఫాన్ తీవ్రరూపం దాల్చుతుంది. దీంతో పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.

Nellore Penna River: సంగం పెన్నా వారధి వద్ద తప్పిన పెను ప్రమాదం..
Nellore Penna River

నెల్లూరు: మొంథా తుఫాన్ కారణంగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. మరోవైపు వర్షాలకు పెన్నానది ఉగ్రరూపం దాలుస్తోంది. ఈ క్రమంలో సంగం పెన్నా వారధి వద్ద పెను ప్రమాదం తప్పింది. పెన్నా నది నుంచి ఇసుక తరలించేందుకు నిల్వ ఉంచిన మూడు పడవలు.. భారీగా నీరు రావడంతో తాళ్ళు తెంచుకొని పెన్నానది గట్టున నిలిచాయి. అయితే ఆ పడవలు పెన్నా వారధి గేట్లకు తగలకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. అవి గేట్లకు తగిలి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని అధికారులు చెబుతున్నారు.


ఏపీలో మొంథా తుఫాన్ తీవ్రరూపం దాల్చుతుంది. దీంతో పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరుగాయి. విద్యుత్‌ స్తంభాలు విరిగి రోడ్డుపై పడ్డాయి. పలు కాలనీలకు భారీగా వరద నీరు చేరడంతో.. జలదిగ్బంధంలో ఇరుక్కున్నాయి. పలు చోట్లు వాగులు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి. వరద నీరు రోడ్లపైకి వచ్చి చేరడంతో.. గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు తుఫాన్ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.


ఇవి కూడా చదవండి..

United Aircraft Corporation: భారత్‌లో పౌర విమానాల తయారీ

Lufthansa Flight Incident: లుఫ్తాన్సా విమానంలో ఘర్షణ

Updated Date - Oct 29 , 2025 | 09:01 AM