Nagula Chavithi: నెల్లూరు జిల్లాలో అరుదైన దృశ్యం.. శివలింగాన్ని చుట్టుకొన్న రెండు నాగు పాములు
ABN , Publish Date - Oct 26 , 2025 | 10:19 AM
నాగుల చవితి నాడు అరుదైన దృశ్యం అగుపించింది. పర్వదిన వేళ రెండు నాగు పాములు ఒకేసారి శివలింగాన్ని చుట్టుకొని భక్తులను ఆశ్చర్యపరిచాయి. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా చెర్లోపల్లి రైల్వేగేట్ వద్ద ఉన్న విశ్వనాథ స్వామి ఆలయంలో
ఇంటర్నెట్ డెస్క్: నాగుల చవితి నాడు అరుదైన దృశ్యం అగుపించింది. పర్వదిన వేళ రెండు నాగు పాములు ఒకేసారి శివలింగాన్ని చుట్టుకొని భక్తులను ఆశ్చర్యపరిచాయి. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా చెర్లోపల్లి రైల్వేగేట్ వద్ద ఉన్న విశ్వనాథ స్వామి ఆలయంలో ఈ వింత చోటుచేసుకుంది. దీని గురించి ఆలయ అర్చకులు శ్రీనివాసులు వివరణ ఇచ్చారు. నాగుల చవితి సందర్భంగా ఏటా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హోమం, అభిషేకాలను నిర్వహిస్తామని, ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి అక్కడే నిద్రించామని చెప్పారు.
ఈ క్రమంలో అర్ధరాత్రి దాటాక దాదాపు 3 గంటల సమయంలో నాగుపాములు బుసలు కొడుతూ శివలింగం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ కనిపించాయని వెల్లడించారు . కొంచెంసేపటి తర్వాత వెనుక ఉన్న పుట్టలోకి రెండు నాగు పాములు వెళ్లిపోయినట్లు అర్చకుడు వివరించారు.
ఇవి కూడా చదవండి:
పాక్ తీరుపై ఐక్యరాజ్య సమితి మౌనం.. మంత్రి జైశంకర్ విమర్శలు
పాక్‌కు భారత్ తరహాలో బుద్ధి చెప్పేందుకు సిద్ధమైన అఫ్ఘానిస్థాన్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి