దెయ్యాలు వేదాలు వల్లించడం.. జగన్ కల్తీ లిక్కర్ గురించి మాట్లాడటం నూటికి నూరుశాతం ఒక్కటేనని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సెటైర్లు గుప్పించారు. జగన్ తన అక్రమార్జన కోసం నాణ్యత లేని జే బ్రాండ్స్తో వేలమంది ప్రాణాలు తీసి లక్షలాది మంది ఆరోగ్యాన్ని దెబ్బతీశారని ధ్వజమెత్తారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.
ప్రజాప్రతినిధులు పార్టీ మారితే.. ఆ పార్టీ ద్వారా పొందిన పదవికి రాజీనామా చేయాలని వెంకయ్యనాయుడు తెలిపారు. రాజ్యాంగంలో 10వ షెడ్యూల్ని సవరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఇద్దరు యువకులను గుర్తు తెలియని వ్యక్తులు కర్రలతో కొట్టి హత్య చేసినట్లు తెలిపారు. సంఘటన స్థలంలో విరిగిన కర్రలు, రక్తపు మరకలు గుర్తించినట్లు పేర్కొన్నారు.
గూడూరుకు రూ.73 కోట్ల నిధులు మంజూరయ్యాయని మంత్రి నారాయణ తెలిపారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలకు అమృత్ పథకం కింద నిధులు విడుదల చేసినట్లు చెప్పారు.
కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను సూపర్ సక్సెస్ చేసిందని ఎమ్మెల్యే సోమిరెడ్డి అన్నారు. ఆటో డ్రైవర్ల కొరకు ప్రత్యేకంగా ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చిందన్నారు.
నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడలోని అమ్మవారి ఆలయంలో దారుణం చోటు చేసుకుంది. అమ్మవారికి పూజలు నిర్వహిస్తూ పురోహితుడు కుప్పకూలిపోయాడు.
పూజలు లేని ఆలయాలను దూపదీప నైవేద్యం పథకం కింద పరిరక్షిస్తున్నామని మంత్రి ఆనం తెలిపారు. భగవన్ నామస్మరణ కోసం ఆలయాలు అభివృద్ధి చేస్తున్నామన్నారు. దేవాదాయశాఖను ప్రక్షాళన చేస్తున్నామని... 476 ఆలయాలకు పాలకవర్గం ఏర్పాటు చేశామని మంత్రి వెల్లడించారు.
దేవాలయాల ఆస్తుల పరిరక్షణ కోసం స్పెషల్ చీఫ్ సెక్రటరీ, డీజీపీలతో కూటమి ప్రభుత్వం కమిటీ వేసిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఆలయాల్లో నాయీబ్రాహ్మణులకి ట్రస్టు బోర్డు మెంబర్లుగా అవకాశం కల్పించామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గుర్తుచేశారు.
నెల్లూరులో నకిలీ పోలీస్ అరెస్ట్ అయ్యాడు. క్రైమ్ బ్రాంచ్ CI నంటూ చెలామణీ అవుతూ ఇంతకాలం పబ్బం గడుపుకున్న నకిలీ కేటుగాడిని వేదాయపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు.
Nellore Road Accident: నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును టిప్పర్ ఢీకొన్న ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.