Nellore: డ్రైవర్, కండక్టర్‌పై దాడి చేసిన నిందితులకు షాక్ ఇచ్చిన పోలీసులు
ABN , Publish Date - Dec 08 , 2025 | 09:48 PM
సీటి బస్సు డ్రైవర్, కండక్టర్‌పై దాడికి తెగబడిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారికి పోలీసులు షాక్ ట్రీట్‌మెంట్ ఇచ్చారు.
నెల్లూరు,డిసెంబర్ 08: రహదారిపై నిలిపిన బైక్ పక్కకు తియ్యాలంటూ సూచించిన సిటీ బస్సు డ్రైవర్‌తోపాటు కండక్టర్‌పై మారణాయుధాలతో దాడికి పాల్పడిన నిందితులను నెల్లూరు నగర పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. నిందితులకు విభిన్న పద్దతిలో పోలీసులు ట్రీట్‌మెంట్ ఇచ్చారు. ఈ దాడికి పాల్పడిన నిందితులను నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్ నుంచి కూరగాయల మార్కెట్ వరకు నడి రోడ్డుపై నడిపించారు. నేరాలు, దాడులకు పాల్పడితే ఎంతటి వారినైనా ఇలాగే నడిరోడ్డుపై నడిపిస్తామని పోలీసులు హెచ్చరించారు. సన్మార్గంలో నడుచుకోవాలంటూ యువతకు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అజిత వెజండ్ల సూచించారు. పిల్లలు తప్పుదోవ పట్టకుండా జాగ్రత్త వహించాలని తల్లిదండ్రులు జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.
ఇంతకీ ఏం జరిగిందంటే..
ఆదివారం నెల్లూరులోని నక్కలోళ్ల సెంటర్ వద్ద రహదారిపై బైక్‌ను అడ్డంగా నిలిపారు. బైక్‌ను పక్కకు తీయాలంటూ యువకులకు బస్సు డ్రైవర్ మన్సూర్‌తోపాటు కండెక్టర్ సలీమ్ సూచించారు. ఆ క్రమంలో యువకులు, బస్సు డ్రైవర్‌కు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. డ్రైవర్‌కు మద్దతుగా కండక్టర్ మాట్లాడాడు. దాంతో బస్సు డ్రైవర్, కండక్టర్‌పై ఆ యువకులు మారణాయుధాలతో దాడి చేశారు. బస్సు డ్రైవర్ గొంతు కోశారు. కండక్టర్‌పై దాడి చేశారు.
దీంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. స్థానికులు వెంటనే స్పందించి.. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సంతపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దాడి జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరా ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలించి.. నిందితులను పట్టుకున్నారు. అనంతరం నడి రోడ్డుపై వారితో పరేడ్ చేయించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాజకీయ ముసుగులో నేరాల చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తాం: సీఎం
రామ్మోహన్ నాయుడికి ప్రధాని, హోం మంత్రి ఫోన్..
Read Latest AP News And Telugu News