Share News

Nellore: మారణాయుధాలతో దాడి.. బస్సు డ్రైవర్ పరిస్థితి విషమం..

ABN , Publish Date - Dec 07 , 2025 | 07:52 PM

నెల్లూరులో దారుణం చోటు చేసుకుంది. బస్సు డ్రైవర్, కండక్టర్‌పై దుండగులు మారణాయుధాలతో దాడి చేశారు. డ్రైవర్ గొంతు కోశారు. ఈ దాడిలో కండక్టర్ తీవ్రంగా గాయపడ్డారు.

Nellore: మారణాయుధాలతో దాడి.. బస్సు డ్రైవర్ పరిస్థితి విషమం..

నెల్లూరు, డిసెంబర్ 07: నెల్లూరులో దారుణం చోటు చేసుకుంది. నక్కలోళ్ల సెంటర్ వద్ద సిటీ బస్సు డ్రైవర్, కండక్టర్‌పై ఆదివారం దుండగులు మారణాయుధాలతో దాడి చేశారు. డ్రైవర్ మన్సూర్ గొంతు కోశారు. అలాగే బస్సు కండక్టర్ సలీమ్‌పై దాడి చేశారు. అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికులు వెంటనే స్పందించి.. వారిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ మన్సూర్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఆసుపత్రికి చేరుకుని కండక్టర్‌ నుంచి వివరాలు సేకరించారు. ఈ దాడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఈ దాడికి కొద్దిసేపటి ముందు.. రహదారిపై బైక్ అడ్డంగా నిలిపి ఉంది. ఆ వాహనాన్ని పక్కకు తీయాలంటూ యువకులకు బస్సు డ్రైవర్ సూచించాడు. ఆ క్రమంలో యువకులు, బస్సు డ్రైవర్‌‌కు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. డ్రైవర్‌కు మద్దతుగా కండక్టర్ మాట్లాడాడు. దాంతో బస్సు డ్రైవర్, కండక్టర్‌పై ఆ యువకులు మారణాయుధాలతో దాడి చేశారు. అనంతరం వారు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనపై సంతపేట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ దాడి జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరా ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

శాప్‌తో ఏసీఏ కలిసి అన్ని క్రీడలు ప్రోత్సహించేలా కృషి: ఎంపీ కేశినేని చిన్ని

సీఎం రేవంత్‌కి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఛాలెంజ్

For More AP News And Telugu News

Updated Date - Dec 07 , 2025 | 08:26 PM