Share News

MP Kesineni Chinni: శాప్‌తో ఏసీఏ కలిసి అన్ని క్రీడలు ప్రోత్సహించేలా కృషి: ఎంపీ కేశినేని చిన్ని

ABN , Publish Date - Dec 07 , 2025 | 04:35 PM

యువ‌త‌లో స్ఫూర్తి నింపేందుకు క్రీడా పోటీలు నిర్వ‌హించాలని విజయవాడ ఎంపీ కేశినేని నాని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇలాంటి నేష‌న‌ల్ లెవ‌ల్ గేమ్స్ కాంపిటేష‌న్స్ మరెన్నో జ‌ర‌గాల‌ని ఆయన ఆకాంక్షించారు.

MP Kesineni Chinni: శాప్‌తో ఏసీఏ కలిసి అన్ని క్రీడలు ప్రోత్సహించేలా కృషి: ఎంపీ కేశినేని చిన్ని

విజ‌య‌వాడ,డిసెంబర్ 07: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్)తో కలిసి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) తరఫున అన్ని క్రీడలను ప్రోత్సహించే విధంగా కృషి చేస్తామని విజయవాడ ఎంపీ, ఏసీఏ అధ్యక్షుడు కేశినేని చిన్ని స్పష్టం చేశారు. ఆదివారం విజయవాడలో యోనెక్స్ -స‌న్ రైజ్ 87వ సీనియ‌ర్ నేష‌న‌ల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ లోగో, పోస్ట‌ర్‌ను ఎంపీ కేశినేని శివ‌నాథ్‌తోపాటు శాప్ చైర్మన్‌ ర‌వినాయుడు, ఇంట‌ర్నేష‌న‌ల్ బ్యాడ్మింటన్ ప్లేయ‌ర్ కిడాంబి శ్రీకాంత్, ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేష‌న్ సెక్ర‌ట‌రీ డాక్ట‌ర్ పి. అంక‌మ్మ చౌద‌రి ఆవిష్కరించారు.


అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ.. యువ‌త‌లో స్ఫూర్తి నింపేందుకు ఇలాంటి క్రీడా పోటీలు నిర్వ‌హించాలని సూచించారు. రాష్ట్రంలో ఇలాంటి నేష‌న‌ల్ లెవ‌ల్ గేమ్స్ కాంపిటేష‌న్స్ మరెన్నో జ‌ర‌గాల‌ని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. రాష్ట్రంలో న‌లుమూల‌ల క్రీడా పోటీలు నిర్వ‌హించేందుకు సీఎం చంద్ర‌బాబు కృషి చేస్తున్నారని వివరించారు. ఏసీఏ త‌రఫున మంగ‌ళ‌గిరి క్రికెట్ స్టేడియంతో పాటు, ఇంకొన్ని స్టేడియాల్లో అన్ని క్రీడ‌ల‌ను ప్రోత్స‌హించే విధంగా బాడీలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.


క్రీడాకారుల‌ను గుర్తించి ప్రోత్స‌హించ‌టంలో సీఎం చంద్ర‌బాబు ముందుంటారని శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు తెలిపారు. బ్యాడ్మింటన్ అంటే తెలుగు వారు అనే గుర్తింపు రావ‌టానికి కార‌ణం సీఎం చంద్ర‌బాబు నాయుడని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. విజ‌య‌వాడలో డిసెంబ‌ర్ 22 నుంచి 28 వ‌ర‌కు యోనెక్స్ -స‌న్ రైజ్ 87వ సీనియ‌ర్ నేష‌న‌ల్ బ్యాడ్మింటన్ ఛాంపియ‌న్ షిప్ జరుగుతుందని శాప్ చైర్మన్ రవినాయుడు వివరించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం రేవంత్‌కి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఛాలెంజ్

హిందూ మతంపై కుట్రలు సహించేది లేదు: విజయసాయిరెడ్డి

For More AP News And Telugu News

Updated Date - Dec 07 , 2025 | 05:02 PM