Share News

Vijayasai Reddy: హిందూ మతంపై కుట్రలు సహించేది లేదు: విజయసాయిరెడ్డి

ABN , Publish Date - Dec 07 , 2025 | 03:21 PM

2019 ఎన్నికలకు ముందు అంటే.. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఆ పార్టీలో విజయ సాయి రెడ్డి కీలక నేతగా వ్యవహరించారు. అందుకే ఆయన సేవలను ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ గుర్తించి.. వరుసగా పలుమార్లు రాజ్యసభ సభ్యుడిగా విజయసాయిరెడ్డికి అవకాశం కల్పించారు.

Vijayasai Reddy: హిందూ మతంపై కుట్రలు సహించేది లేదు: విజయసాయిరెడ్డి

విశాఖపట్నం, డిసెంబర్ 07: హిందూ మతంపై కుట్రలు సహించేది లేదని మాజీ ఎంపీ విజయ సాయి రెడ్డి స్పష్టం చేశారు. డబ్బు ఆశ చూపి.. మతం మార్చాలని ప్రయత్నిస్తే మాత్రం అటువంటి వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పి.. గుణపాఠం నేర్పిద్దామని ఆయన పేర్కొన్నారు. గత రెండు దశాబ్దాలుగా జరిగిన మత మార్పిడులపై కమిటీ వేసి విచారణ జరపాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. దేశం కోసం ధర్మం కోసం హిందువుల్లో ఉన్న అన్ని సామాజిక వర్గాలు ఒక్కటవ్వాలని విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. అదే భారతదేశానికి రక్ష ..శ్రీరామ రక్ష అని తెలిపారు. ఈ మేరకు ఆదివారం విజయసాయిరెడ్డి తన ఎక్స్ ఖాతా వేదికగా హిందూ మతంపై ఈ వ్యాఖ్యలు చేశారు.


2019 ఎన్నికలకు ముందు అంటే.. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఆ పార్టీలో విజయ సాయి రెడ్డి కీలక నేతగా వ్యవహరించారు. అందుకే ఆయన సేవలను ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ గుర్తించి.. వరుసగా రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా విజయసాయిరెడ్డికి అవకాశం కల్పించారు. ఇక 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ అధికారం చేపట్టిన తర్వాత.. విజయసాయిరెడ్డి ప్రాభవం దాదాపుగా తగ్గిపోయింది. ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ ఇన్‌ఛార్జ్‌గా ఆయన పరిమితమై పోయారు. ఆ తర్వాత ఆ బాధ్యతల నుంచి తప్పించి.. పార్టీలో కొత్త బాధ్యతలు అప్పగించారు.


ఇంతలో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. ఈ ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమైపోయింది. ఆ కొద్ది నెలలకే వైసీపీతోపాటు రాజ్యసభ సభ్యత్వానికి సైతం విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. అప్పటి వరకు సోషల్ మీడియా వేదికగా నిత్యం స్పందించే విజయసాయిరెడ్డి ఆ తర్వాత తెరమరుగైపోయారు.

మీడియా ముందుకే కాదు.. సోషల్ మీడియాకు సైతం ఆయన దూరంగా ఉన్నారు. అలాంటి విజయసాయిరెడ్డి.. తాజాగా తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించడం.. అది కూడా హిందూ మతంపై కుట్రలు చేస్తే సహించేది లేదంటూ ఆయన వ్యాఖ్యానించడం చర్చకు తెర తీసింది. ఏదో ఒక పార్టీలో చేరే ఉద్దేశ్యంతోనే విజయసాయిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. దేశం కోసం ధర్మం కోసం.. అంటూ తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలతో జాతీయ పార్టీలో చేరే ఉద్దేశ్యంతోనే ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారనే ఒక చర్చ నడుస్తోంది.



ఈ వార్తలు కూడా చదవండి..

ఉపాధ్యాయుడి దాస్టీకం.. 20 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు..

ఫార్మా, ఐటీకి.. ఏపీ హబ్‌గా మారబోతోంది: మాధవ్

For More AP News And Telugu News

Updated Date - Dec 07 , 2025 | 04:18 PM