Teacher Assault Incident: ఉపాధ్యాయుడి దాస్టీకం.. 20 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు..
ABN , Publish Date - Dec 07 , 2025 | 01:47 PM
ఓ ఉపాధ్యాయుడు ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థులపై దారుణానికి ఒడిగట్టాడు. వారిపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఉపాధ్యాయుడి దాడిలో ఏకంగా 20 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోవాల్సిన ఓ ఉపాధ్యాయుడు ఘాతుకానికి ఒడిగట్టాడు. అత్యంత దారుణమైన పనికి తెరతీశాడు. విద్యార్థులను చావ చితకబాదాడు. దీంతో 20 మంది విద్యార్థులు తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ సంఘటన ఉమ్మడి నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. అరుణ్ అనే వ్యక్తి ఓజిలి మండలం ఏకలవ్య గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఏమైందో ఏమో తెలీదు కానీ అరుణ్ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థులపై రెచ్చిపోయాడు.
అందర్నీ చావ చితకబాదాడు. దీంతో 20 మంది విద్యార్థులు తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ విషయం విద్యార్థుల తల్లిదండ్రులకు తెలిసింది. వారు హుటాహుటిన పాఠశాల దగ్గరకు చేరుకున్నారు. పాఠశాల ముందు ధర్నా చేశారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌లో విద్యార్థులపై దాడికి పాల్పడ్డ ఉపాధ్యాయుడు అరణ్‌పై ఫిర్యాదు చేశారు.
ఇవి కూడా చదవండి
గోవా నైట్ క్లబ్ ప్రమాదం.. వెలుగులోకి భయానక వీడియో..
ఫార్మా, ఐటీకి.. ఏపీ హబ్‌గా మారబోతోంది: మాధవ్