Nellore: అయ్యో పాపం... ఆకలి బాధ భరించలేక ఓ వ్యక్తి
ABN , Publish Date - Dec 25 , 2025 | 02:17 PM
గుంటూరు జిల్లా వడ్డేశ్వరం వాసి అయిన అమీర్ వల్లి.... ఉపాధి కోసం మూడు రోజుల క్రితం నెల్లూరు వచ్చాడు. అయితే మూడు రోజు నుంచి కూలీ పనులు దొరక్క పోవడంతో ఇబ్బంది పడ్డాడు.
నెల్లూరు, డిసెంబర్ 25: మనిషికి కావాల్సింది కూడు, గూడు, గుడ్డ. దాని కోసమే మనిషి కష్టపడుతూ ఉంటాడు. కానీ సరైన తిండి లేక ఎంతో మంది అల్లాడిపోతున్నారు. పేదరికంలో మగ్గిపోతూ తినడానికి తిండి కూడా దొరక్క బాధపడుతున్న వారు చాలా మందే ఉన్నారు. అన్నం దొరక్క పోతే ఆ ఆకలి బాధ వర్ణనాతీతమనే చెప్పుకోవాలి. ఇప్పుడు చెప్పుకోబోయే ఘటన మాత్రం ప్రతి ఒక్కరినీ కలిచి వేస్తుంది. ఆకలి బాధతో ఓ వ్యక్తి చేసిన పని తెలిస్తే బాధపడకుండా ఉండలేరు. వివరాల్లోకి వెళితే...
నెల్లూరు జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. కనకమహల్ సెంటర్‌లో ఆకలి బాధని భరించలేక ఓ వ్యక్తి కత్తితో గొంతు కోసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. బాధితుడు అమీర్ వల్లిగా గుర్తించారు. గుంటూరు జిల్లా వడ్డేశ్వరం వాసి అయిన అమీర్ వల్లి.... ఉపాధి కోసం మూడు రోజుల క్రితం నెల్లూరు వచ్చాడు. అయితే మూడు రోజు నుంచి కూలీ పనులు దొరక్క పోవడంతో ఇబ్బంది పడ్డాడు. చేతిలో చిల్లి గవ్వ లేకపోవడంతో ఆకలికి అలమటించిపోయాడు.
కూలి పనులు దొరక్కపోవడంతో మనస్థాపానికి గురైన అతడు కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఆకలి బాధతో తన గొంతు తానే కత్తి కోసుకున్నాడు. స్థానికులు ఇచ్చి సమాచారంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు పోలీసులు. రక్తస్రావం అవుతున్న అమీర్ వల్లిని వెంటనే జీజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం అమీర్ వల్లికి ఆస్పత్రిలో చికిత్స అందజేస్తున్నారు వైద్యులు. అయితే ఆకలి బాధతో ఇలాంటి దారుణానికి పాల్పడిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
ఇవి కూడా చదవండి...
గిరిజన విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఆ నిధులు విడుదల
కేంద్రమంత్రి శివరాజ్‌ను ఇంటికి ఆహ్వానించిన సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News