AP Govt: గిరిజన విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఆ నిధులు విడుదల
ABN , Publish Date - Dec 25 , 2025 | 11:59 AM
2025–26 విద్యా సంవత్సరంలో ప్రస్తుతం అర్హులైన విద్యార్థులకు నిధులను విడుదల చేసినట్లు మంత్రి గుమ్మడి సంధ్యారాణి చెప్పారు. ఇప్పటి వరకు మొత్తం రూ.100.93 కోట్లు విడుదల చేశామని
అమరావతి, డిసెంబర్ 25: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజన విద్యార్థులకు ప్రభుత్వం (AP Govt) శుభవార్త చప్పింది. గిరిజన విద్యార్థులకు స్కాలర్ షిప్‌లు విడుదల చేసింది ప్రభుత్వం. దీనిపై రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మడి సంధ్యారాణి (Minister Gummadi Sandhyarani) మాట్లాడుతూ.. గిరిజన విద్యార్థులకు సంబంధించిన పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల విషయంలో గత ప్రభుత్వ కాలంలో పెండింగ్‌లో ఉన్న బకాయిలను ఇప్పటికే కూటమి ప్రభుత్వం విడుదల చేసినట్లు తెలిపారు.
ఇప్పుడు తాజాగా 2025–26 విద్యా సంవత్సరంలో ప్రస్తుతం అర్హులైన విద్యార్థులకు నిధులను విడుదల చేసినట్లు చెప్పారు. ఇప్పటి వరకు మొత్తం రూ.100.93 కోట్లు విడుదల చేశామని.. దీని ద్వారా 59,297 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియ ద్వారా గిరిజన విద్యార్థుల విద్య నిలకడగా, సానుకూలంగా, సంతృప్తికరంగా, భయం లేకుండా కొనసాగేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
కేంద్రమంత్రి శివరాజ్‌ను ఇంటికి ఆహ్వానించిన సీఎం చంద్రబాబు
ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మహిళలు మృతి
Read Latest AP News And Telugu News