Pinnelli Brothers: పిన్నెల్లి సోదరులకు రిమాండ్ పొడిగింపు..
ABN , Publish Date - Dec 25 , 2025 | 01:09 PM
జంట హత్యల కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితోపాటు ఆయన సోదరుడికి మరో 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.
నరసరావుపేట, డిసెంబర్ 25: జంట హత్యల కేసులో వైసీపీ నేతలు, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డికి జనవరి 7 వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ జూనియర్ సివిల్ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. గురువారం నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న వీరిని మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి ప్రశాంత్ వర్చువల్‌గా విచారించారు. అనంతరం వారి రిమాండ్‌ను పొడిగించారు.
2025 మే 24న పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ నేతలు జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావులు దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యలపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ఏ6గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఏ7గా పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి ఉన్నారు. తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ పిన్నెల్లి సోదరులు హైకోర్టును ఆశ్రయించారు. అందుకు హైకోర్టు నిరాకరించింది. దీనిని సవాల్ చేస్తూ.. వీరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
వీరి ముందస్తు బెయిల్‌పై కోర్టులో విచారణ కొనసాగింది. ఈ సందర్భంగా ఇరువైపులా వాదోపవాదాలు జరిగాయి. అనంతరం పిన్నెల్లి సోదరులు కోర్టులో లొంగిపోయేందుకు సుప్రీం కోర్టు రెండు వారాల గడువు విధించింది. డిసెంబర్ 11న చివరి రోజు కావడంతో.. ఆ రోజు మాచర్ల జూనియర్ సివిల్ కోర్టులో లొంగిపోయారు. అనంతరం వారికి న్యాయమూర్తి రిమాండ్ విధించారు. దాంతో వారిని నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ రిమాండ్ నేటితో అంటే డిసెంబర్ 25తో ముగియనుంది. దాంతో వారిని వర్చువల్‌గా కోర్టులో హాజరుపరిచారు. దీంతో మరో 14 రోజుల పాటు వారికి కోర్టు రిమాండ్ విధించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
కాలేజీ బస్సు బోల్తా.. విద్యార్థులకు గాయాలు
మళ్లీ బాంబు బెదిరింపు.. విమానం అత్యవసర ల్యాండింగ్..
For More AP News And Telugu News