ఉద్యోగులపై పెండింగ్‌లో ఉన్న క్రమశిక్షణా కేసులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు.
: ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిపై పెట్టిన కేసులు అక్రమమని, ఆ కేసులు ఎత్తివేసి ఆయనను వెంటనే విడుదల చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు.
తాలుకా పోలీస్ స్టేషన్ పరిధిలో పలు కాలనీల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ రాఘవేంద్ర, సీఐ తేజమూర్తి, ఎస్‌ఐ మోహన కిషోర్ రెడ్డి సోమవారం సాయంత్రం నిందితుల వివరాలు వెల్లడించారు.
ప్రభుత్వ వెటర్నరీ పాలిటెక్నికల్ కళాశాల సమస్యలకు నిలయంగా మారింది. మండలంలోని హుసేనాపురం గ్రామంలో వెటర్నరీ పాలిటెక్నికల్ కళాశాల ఉంది. దాదాపు 40 మంది విద్యార్థులు చదువుతున్నారు. కళాశాలలో వసతులు సరిగా లేకపోవడంతో విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటున్నారు.
: గత వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకు వచ్చిన సచివాలయ వ్యవస్థకు సరైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమైనట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంకా అనేక గ్రామాల్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్‌లు అసంపూర్తిగానే మిగిలిపోయాయి.
డ్రోన సిటీ ఫేజ్-1 పనులను త్వరితగతిన వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఏ.సిరి ఏపీఐఐసీ అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో బీసీల అభివృద్ది సీఎం చంద్రబాబుతో సాధమని ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి అన్నారు. ఆదివారం ఓ ఫంక్షన్ హాల్‌లో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్రస్థాయి రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు.
మండలంలోని ఓబులంపల్లె గ్రామం ఎంపీపీ పాఠశాల(ఉర్దూ) మూత పడింది. రెండు నెలలుగా పాఠశాలను తెరవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
పట్టణంలోని ప్రధాన రహదారిపై మూగజీవాలు తిష్టవేస్తున్నాయి. రహదారికి అడ్డంగా ఆవులు నిలబడుతుండడంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
ఇటీవల పాముకాటుతో వ్యవసాయ కూలీలు, రైతులు మృత్యువాత పడుతున్నారు. పాము కరచిన తర్వాత ఆసుపత్రికి తరలించేందుకు సమయం పడుతుండటంతో బాధితులు మరణిస్తున్నారు