మత్తు పదార్థాల అదుపు అభినందనీయం
ABN , Publish Date - Feb 16 , 2026 | 11:36 PM
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో శ్రీశైల క్షేత్ర పరిధిలోకి నిషేధిత మత్తు పదార్థాలను ప్రవేశించే వీలులేకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటూ రాత్రింబవళ్లు గస్తీ నిర్వహించిన వివిధ పోలీస్ శాఖల అధికారులు సిబ్బందిని నంద్యాల జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి రవికుమార్ అభినందించి ప్రశంసా పత్రాలను అందించారు.
పకడ్బందీగా గస్తీ నిర్వహించిన వివిధ శాఖలు
శ్రీశైలం, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో శ్రీశైల క్షేత్ర పరిధిలోకి నిషేధిత మత్తు పదార్థాలను ప్రవేశించే వీలులేకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటూ రాత్రింబవళ్లు గస్తీ నిర్వహించిన వివిధ పోలీస్ శాఖల అధికారులు సిబ్బందిని నంద్యాల జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి రవికుమార్ అభినందించి ప్రశంసా పత్రాలను అందించారు. కలెక్టర్ రాజకుమారి ఆదేశాల మేరకు బ్రహ్మోత్సవాలలో మద్యం, నాటుసారాయి, గంజాయి వంటి మత్తు పదార్థాలు క్షేత్రంలోకి రాకుండా జాగ్రత్తలు తీసుకున్న నందికొట్కూరు సీఐ రామాంజనేయులు, హెచ్‌సీ శంకరయ్య, కానిస్టేబుల్ సుధీర్‌కుమార్, మధుప్రసాద్, రమీజాబీ మండల పరిధిలోని వివిధ ప్రదేశాల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. నంద్యాల అసిస్టెంట్ సూపరింటెండెంట్ రామడు పర్యవేక్షణలో ఏడుగురు సీఐలు, ఐదుగురు ఎస్సైలు, యాభై మంది సిబ్బంది సహాయంతో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ కృషిని గుర్తించి ప్రశంసా పత్రం ఇచ్చినట్లు ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి రవికుమార్ తెలిపారు.