Share News

‘ఉపాధి’ని నిర్వీర్యం చేసేందుకు కుట్రలు

ABN , Publish Date - Feb 16 , 2026 | 01:07 AM

మహత్మా గాంధీ జాతీయ ఉపాధి హమీ పథకాన్ని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పన్నుతోందని ఏఐసీసీ సభ్యుడు, కర్నూలు జిల్లా పార్టీ ఇన్‌చార్జి లక్ష్మీనరసింహయదవ్‌ అన్నారు.

‘ఉపాధి’ని నిర్వీర్యం చేసేందుకు కుట్రలు

ఏఐసీసీ సభ్యుడు లక్ష్మీనరసింహయాదవ్‌

కర్నూలు అర్బన్‌, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): మహత్మా గాంధీ జాతీయ ఉపాధి హమీ పథకాన్ని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పన్నుతోందని ఏఐసీసీ సభ్యుడు, కర్నూలు జిల్లా పార్టీ ఇన్‌చార్జి లక్ష్మీనరసింహయదవ్‌ అన్నారు. ఆదివారం నగరంలోని నంద్యాల చెక్‌పోస్టు వద్ద ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 17న కర్నూలు, 18న నంద్యాల జిల్లాల్లో పర్యటించన్ను పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పాల్గొనే ఉపాధి హామీ పరిరక్షణ యాత్రను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో రచ్చబండ కార్యక్రమం జరుగుతుందని, 17న కోడుమూరు నియోజవర్గం పరిధిలోని గార్గేయపురంలో సాయంత్రం 4 గంటలకు, 18న నంద్యాల జిల్లాలోని కానాలపల్లి, శిరివెళ్లలో జరిగే కార్యక్రమానికి రైతులు, కూలీలు, కాంగ్రెస్‌ శ్రేణులు, ప్రజలు భారీ ఎత్తున తరలిరావాలని కోరారు.

Updated Date - Feb 16 , 2026 | 01:07 AM