Share News

ప్రజలను మోసం చేసిన ప్రభుత్వం

ABN , Publish Date - Feb 16 , 2026 | 01:12 AM

కర్నూలు జిల్లా అభివృద్ధికి బడ్జెట్‌లో నిధులు కేటాయించకుండా కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని సీపీఎం జిల్లా కార్యదర్శి డి. గౌస్‌దేశాయ్‌ అన్నారు.

ప్రజలను మోసం చేసిన ప్రభుత్వం
కలెక్టరేట్‌ ఎదుట నిరసనలో మాట్లాడుతున్న సీపీఎం నాయకులు

సీపీఎం జిల్లా కార్యదర్శి గౌస్‌దేశాయ్‌

కర్నూలు న్యూసిటీ, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లా అభివృద్ధికి బడ్జెట్‌లో నిధులు కేటాయించకుండా కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని సీపీఎం జిల్లా కార్యదర్శి డి. గౌస్‌దేశాయ్‌ అన్నారు. ఆదివారం సీపీఎం ఆధ్వర్యంలో రాష్ట్ర బడ్జెట్‌లో కర్నూలు జిల్లాకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా కలెక్టరేట్‌ ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా గౌస్‌దేశాయ్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రూ.3.32 లక్షల కోట్ల బడ్జెట్‌లో జిల్లా అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఎలాంటి నిధులు కేటాయించలేదని అన్నారు. జిల్లాకు నిఽధులు కేటాయించడంలో అన్యాయం జరిగితే ప్రజలను సమీకరించి రాబోయే కాలంలో ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పాతబస్తీ కార్యదర్శి రాజశేఖర్‌, జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు పీఎస్‌. రాధాక్రిష్ణ, జి.రామక్రిష్ణ, కేవీ.నా రాయణ, రాముడు, ఆనంద్‌బాబు, నగేష్‌. నరసింహులు పాల్గొన్నారు.

Updated Date - Feb 16 , 2026 | 01:12 AM