సమస్యల పరిష్కార వేదికకు 65 ఫిర్యాదులు
ABN , Publish Date - Feb 16 , 2026 | 11:39 PM
ప్రజా ఫిర్యాదుల పరి ష్కార వేదిక కార్యక్రమానికి 65 ఫిర్యాదులు వచ్చాయని, వాటిపై విచారణ జరిపి పరిష్కరిస్తామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.
విచారణ జరిపి న్యాయం చేస్తాం ఫ ఎస్పీ విక్రాంత్ పాటిల్
కర్నూలు క్రైం, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): ప్రజా ఫిర్యాదుల పరి ష్కార వేదిక కార్యక్రమానికి 65 ఫిర్యాదులు వచ్చాయని, వాటిపై విచారణ జరిపి పరిష్కరిస్తామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. సోమవారం స్థానిక కొత్తపేటలోని టూటౌన్ పోలీస్‌స్టేషన్ సమీపంలో ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ హుశేన్‌పీరా, సీఐలు మన్సూరుద్దీన్, విజయలక్ష్మి పాల్గొన్నారు.