Share News

ఆదోని జిల్లా ఏర్పాటు చేసే దాకా పోరాటం

ABN , Publish Date - Feb 16 , 2026 | 01:10 AM

పశ్చిమ ప్రాంత ఐదు నియోజకవర్గాలని కలిపి ఆదోని జిల్లాగా ప్రకటించే వరకు పోరాటం కొనసాగిస్తామని జిల్లా సాధన జేఏసీ నాయకులు కృష్ణమూర్తి గౌడ్‌, కోదండ, ఆడజన రాజ్య అఽధికార సమైక్య జిల్లా కన్వీనర్‌ పగడాల జయమ్మ అన్నారు.

ఆదోని జిల్లా ఏర్పాటు చేసే దాకా పోరాటం
దీక్షలో పాల్గొన్న మహిళలు

ఆదోని అగ్రికల్చర్‌, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): పశ్చిమ ప్రాంత ఐదు నియోజకవర్గాలని కలిపి ఆదోని జిల్లాగా ప్రకటించే వరకు పోరాటం కొనసాగిస్తామని జిల్లా సాధన జేఏసీ నాయకులు కృష్ణమూర్తి గౌడ్‌, కోదండ, ఆడజన రాజ్య అఽధికార సమైక్య జిల్లా కన్వీనర్‌ పగడాల జయమ్మ అన్నారు. ఆదోని జిల్లా సాధనలో మేము సైతం అంటూ ప్రకాష్‌ నగర్‌, భాస్కర్‌ రెడ్డి నగర్‌, కల్లుబావికి చెందిన మహిళలు ఆదివారం దీక్షలో కూర్చున్నారు. వారు మాట్లాడుతూ పల్లెలు ఏటా ఉపాధి కోసం లక్షల మంది వలస వెళుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరువు శాశ్వత నివారణకు సాగునీటి ప్రాజెక్టులు నిర్మించాలని స్థానికంగా పరిశ్రమల ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వెనుకబడి అభివృద్ధికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ ప్రాంతం అభివృద్ధి ప్రత్యేక జిల్లాతోనే సాధ్యమని అన్నారు.

Updated Date - Feb 16 , 2026 | 01:10 AM