రాజీనామా విషయంలో జాకియా ఖానం కీలక నిర్ణయం తీసుకున్నారు. శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజును కలిసిన ఆరుగురు వైసీపీ ఎమ్మెల్సీలు.. రాజీనామా పత్రాన్ని సమర్పించారు.
రాజీనామా చేసిన ఆరుగురు ఎమ్మెల్సీలతో మండలి చైర్మన్ మోషేన్ రాజు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఎవరి ప్రోద్భలంతోనైనా లేక ప్రలోభాలకు లోనై రాజీనామాలు చేశారా అని ఎమ్మెల్సీలను మండలి చైర్మన్ ప్రశ్నించారు.
విజయవాడ నుంచి హైదరాబాద్, ఢిల్లీ, ముంబైకి నడుస్తున్న సర్వీసులను అంతర్జాతీయ విమానాల కనెక్టివిటీకి అనుసంధానం చేయాలని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడును టీడీపీ ఎంపీలు కోరారు. విజయవాడ - హైదరాబాద్ విమాన సర్వీసులపై కేంద్రమంత్రిని తెలుగుదేశం ఎంపీలు కలిశారు.
ఏపీ వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. ఉదయం 9 గంటలకే 62.40 శాతం మంది లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు.
గ్రేటర్ విజయవాడ విలీన ప్రతిపాదిత జాబితాలోని ప్రాంతాలు కృష్ణాజిల్లాలో ఉన్న ప్పటికీ భౌగోళికంగా విజయవాడకు దగ్గరగా ఉన్నవే. జనసాంద్రతతో కిక్కిరిసిన విజయవాడ విస్తరణకు అవకాశం లేకపోవడంతో సమీప రూరల్ గ్రామాలు విజయవాడతో సమానంగా అభివృద్ధి చెందుతూ విస్తరిస్తున్నాయి. నిడమానూరు, పోరంకి.. ప్రస్తుతం కలిసిపోయేలా విస్తరణాభివృద్ధి జరుగుతోంది. గ్రేటర్ విలీన ప్రతిపాదిత జాబితాలోని నిడమానూరు, పోరంకి ప్రాంతాల విస్తరణాభివృద్ధిపై ఆంధ్రజ్యోతి కథనం.
బంగాళాఖాతంలో దిత్వా తుఫాన్ కొనసాగుతున్న నేపథ్యంలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు వాతావరణ అధికారులు. సహాయక చర్యల్లో భాగంగా మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారయణలు ఇప్పటికే నెల్లూరు జిల్లాకు చేరుకుని ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని సమీక్షిస్తున్నారు.
రాజధాని అమరావతి రైతుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే రాజధాని రైతుల నుంచి సిబ్బంది డబ్బులు అడిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
దిత్వా తుఫాను దూసుకొస్తున్న నేపథ్యంలో అధికారులను హోంమంత్రి అనిత అలర్ట్ చేశారు. ఎటువంటి ప్రాణ నష్టం జరుగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భారీ వర్షాలు కురుస్తున్నపుడు వీలైనంత వరకు ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని హోంమంత్రి సూచనలు చేశారు.
రాజధాని రైతుల సమస్యలపై సీఆర్డీఏ అధికారులతో త్రీ మెన్ కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించింది. రాయపూడి సీఆర్డీఏ కార్యాలయంలో రాజధాని రైతు కమిటీ సభ్యులు, సీఆర్డీఏ అధికారులతో కమిటీ సభ్యులు భేటీ అయ్యారు.
కర్నూలులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రమాదంపై విచారం వ్యక్తం చేస్తూ.. మరణించిన వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.