దేశంలో ఉన్న 560 సంస్థానాలను కలిపి భారతదేశం అంతా ఒకటిగా చేసిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని మాధవ్ పేర్కొన్నారు. స్వాతంత్రం తర్వాత కూడా ఆయన నిరంతర కృషితో ప్రజల కోసం, దేశం కోసం పనిచేశారన్నారు.
సునీతా రెడ్డి తనకు కావాల్సిన విధంగా దర్యాప్తు జరగాలని కోరుకుంటున్నారని.. ఇందుకు సీబీఐని పావుగా వాడుకోవాలని చూస్తున్నారని అవినాష్ అన్నారు.
ప్రతి సంవత్సరం పాండురంగడి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ సంవత్సరం కూడా ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేశామని తెలిపారు.
సర్దార్ పటేల్ జయంతిని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఘన నివాళులర్పించారు.
మహిళలు, విద్యార్థినిలకు క్యాన్సర్‌పై అవగాహన ఉండాలని బోండా ఉమ సూచించారు. ఈ క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలు కేవలం సమాచారాన్ని అందించడమే కాకుండా ప్రజలలో భయాన్ని తొలగిస్తాయన్నారు.
కల్తీ మద్యం కేసులో గతంలో ఇబ్రహీంపట్నంలోని మద్యం తయారీ యూనిట్‌ను అధికారులు తెరిచారు. ఇబ్రహీంపట్నంలోని ఏఎన్ఆర్ బార్లో కనిపించిన నకిలీ మద్యం మరకలు విజయవాడలోని ఓ వైన్ షాపులో కనిపించాయి.
ఒక నియోజకవర్గం ఒకే రెవెన్యూ డివిజన్లో ఉండాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతు న్నాయి. పరిపాలనలో గందరగోళం లేకుండా చేయటం కోసం, నియోజకవర్గ ప్రజలకు కేంద్ర స్థానంగా ఉండటం కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆహ్వానించదగినదే. దీనివల్ల ఉమ్మడి కృష్ణాజిల్లాలోని మూడు నియోజకవర్గాల పరిధిలో తలెత్తిన గందరగోళాలను సరిచేయటంతో పాటు విభజిత జిల్లాల్లో విలీనం చేయాలన్న ప్రాంతాలను కలపటం కూడా తేలికవుతుంది. అదెలా అంటే..
రాజధాని అమరావతి ప్రాంతంలోని వరద నీటిని కృష్ణానదిలోకి చేరవేసే కొండవీడు వాగు రెగ్యులేటర్ ప్రమాదస్థాయికి చేరింది. నదిలో పెరిగిన వరద నీరు దెబ్బతిన్న రెగ్యులేటర్ గేట్ల ద్వారా తిరిగి వాగులోకి చేరుతోంది.
మొంథా తుఫాను గండం వీడిందంటే.. మునేరు వరద ముంపు జిల్లాపై పడగవిప్పింది. తెలంగాణాలో వర్షాల కారణంగా మునేరు మహోధృతమై ప్రవహిస్తోంది. వేలాది ఎకరాల పంటలు ముంపునకు గురయ్యాయి. గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. వత్సవాయి మండలం పోలంపల్లి ఆనకట్ట వద్ద నీటిమట్టం 15 అడుగులకు చేరింది. లింగాల కాజ్‌వేను వరద ముంచెత్తింది. దీంతో ఈ మార్గంలో తెలంగాణాకు రాకపోకలు నిలిచిపోయాయి. పెనుగంచిప్రోలు వంతెనపై కూడా అడుగు ఎత్తున వరద ప్రవహిస్తుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని సమీప గ్రామాలవారు భయాందోళన చెందుతున్నారు. పాలేరు, వైరా, కట్టలేరు కూడా ఉగ్రరూపం దాల్చాయి.
రైతులు కష్టాల్లో ఉంటే... గదిలో కూర్చుని జగన్ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటల బీమాపై జగన్ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు.