Share News

ముగిసిన విజయసాయి రెడ్డి ఈడీ విచారణ

ABN , Publish Date - Jan 22 , 2026 | 06:14 PM

వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేపట్టిన విచారణ ముగిసింది. లిక్కర్‌ స్కాం కేసులో భాగంగా ఈడీ అధికారులు విజయసాయిని దాదాపు 7 గంటల పాటు అధికారులు ప్రశ్నించారు.

ముగిసిన విజయసాయి రెడ్డి ఈడీ విచారణ
Vijay Sai Reddy ED inquiry

హైదరాబాద్‌: ఏపీ లిక్కర్‌ స్కాం కేసులో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) చేపట్టిన విచారణ ముగిసింది. హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో విజయసాయిని దాదాపు 7 గంటల పాటు అధికారులు ప్రశ్నించారు. విచారణలో భాగంగా లిక్కర్ పాలసీ రూపకల్పన, విధాన నిర్ణయాలు, అలాగే రహస్య ఆర్థిక లావాదేవీలపై ఈడీ ఆరా తీసింది. లిక్కర్ పాలసీకి సంబంధించిన సమావేశాలు తన సమక్షంలోనే మూడు సార్లు జరిగినట్లు విజయసాయి రెడ్డి ఈడీకి స్టేట్‌మెంట్‌ ఇచ్చినట్లు సమాచారం.


అదేవిధంగా.. విదేశాలకు నగదు తరలింపు అంశం, షెల్ కంపెనీల ఏర్పాటు, వాటి ద్వారా జరిగిన లావాదేవీలపై కూడా అధికారులు ప్రశ్నలు సంధించారు. షెల్ కంపెనీల ద్వారా అంతిమ లబ్ధిదారులు ఎవరు అనే అంశంపై ఈడీ ప్రత్యేకంగా వివరాలు కోరినట్లు సమాచారం. విచారణ సమయంలో ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కొన్ని కీలక డాక్యుమెంట్లను విజయసాయి రెడ్డి ఈడీ అధికారులకు సమర్పించారు. ఈ మేరకు ఆయన స్టేట్‌మెంట్‌ను కూడా ఈడీ అధికారులు రికార్డు చేశారు.


Also Read:

గుడ్‌న్యూస్.. తెలుగు రాష్ట్రాల మీదుగా మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్..

అదృష్టం కలిసి రావాలంటే ఇంట్లో ఈ మొక్కలు నాటండి.!

బడ్జెట్ 2026: పన్ను చెల్లింపుదారులకు గుడ్‌న్యూస్ చెబుతారా.. ఈ 4 అంశాలపై సానుకూలంగా స్పందిస్తారా.?

Updated Date - Jan 22 , 2026 | 06:18 PM