Share News

అదృష్టం కలిసి రావాలంటే ఇంట్లో ఈ మొక్కలు నాటండి.!

ABN , Publish Date - Jan 22 , 2026 | 05:54 PM

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని ప్రత్యేకమైన మొక్కలను నాటడం వల్ల సానుకూల శక్తి పెరిగి, ఆర్థిక శ్రేయస్సు కలుగుతుందని నమ్మకం. మనీ ప్లాంట్ నుంచి తులసి, వెదురు వరకు ఈ మొక్కలు డబ్బు సమస్యలను తగ్గించి, అదృష్టాన్ని ఆకర్షిస్తాయని చెబుతారు.

అదృష్టం కలిసి రావాలంటే ఇంట్లో ఈ మొక్కలు నాటండి.!
Vastu Plants For Wealth

ఇంటర్నెట్ డెస్క్: ప్రతి ఒక్కరూ జీవితంలో సుఖసంతోషాలతో, ఆర్థికంగా బాగుండాలని కోరుకుంటారు. కానీ ఎన్నో కారణాల వల్ల డబ్బు చేతిలో నిలవడం కష్టం అవుతుంది. ఇలాంటి సమయంలో ఇంట్లో నాటే కొన్ని మొక్కలు సానుకూల శక్తిని తీసుకురావడం సహా అదృష్టాన్నీ పెంచుతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.


వాస్తు ప్రకారం ఇంట్లో సరైన మొక్కలను నాటడం వల్ల ఇంట్లో పచ్చదనం మాత్రమే కాకుండా శాంతి, ఆనందం, ఆర్థిక శ్రేయస్సు కూడా కలుగుతాయని నమ్మకం. ఇప్పుడు అదృష్టాన్ని ఆకర్షించే ఏడు ముఖ్యమైన మొక్కల గురించి తెలుసుకుందాం..

మనీ ప్లాంట్

మనీ ప్లాంట్ సంపదకు చిహ్నంగా భావిస్తారు. వాస్తు ప్రకారం.. ఇది ఇంట్లోకి డబ్బును ఆకర్షించడమే కాకుండా భార్యాభర్తల మధ్య బంధాన్ని కూడా బలపరుస్తుంది. ఈ మొక్క తీగలు ఎంత పచ్చగా, దట్టంగా ఉంటాయో, అంతగా ఇంట్లోకి సంపద ప్రవహిస్తుందని నమ్ముతారు. ఇది గాలిని శుద్ధి చేసే గుణం కూడా కలిగి ఉంటుంది. మనీ ప్లాంట్‌ను ఇంటి ఆగ్నేయ దిశలో ఉంచడం మంచిది.

Money Plant.jpg

తులసి

తులసి మొక్కను హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ మొక్క ఉన్న ఇంట్లో వాస్తు దోషాలు ఉండవని నమ్మకం. ఇది ఆధ్యాత్మిక శక్తిని పెంచడమే కాకుండా గాలిని శుద్ధి చేస్తుంది, రోగాలను దూరంగా ఉంచుతుంది. తులసి మొక్కను ఉత్తరం, ఈశాన్యం లేదా తూర్పు దిశలో నాటడం ఉత్తమం.


అపరాజిత

అపరాజిత అంటే ఓడిపోని మొక్క. నీలి రంగు పువ్వులతో ఉండే ఈ తీగను విష్ణువుకు ఎంతో ప్రియమైనదిగా భావిస్తారు. ఈ మొక్క ఉన్న ఇళ్లలో ఆర్థిక సమస్యలు తగ్గుతాయని, కుటుంబ సభ్యుల ఆత్మవిశ్వాసం పెరుగుతుందని నమ్ముతారు. దీన్ని ఉత్తరం లేదా తూర్పు దిశలో నాటాలి.

Aparijitha.jpg

వెదురు మొక్క

వెదురును అదృష్టానికి ప్రతీకగా చూస్తారు. ఇది భూమి, నీరు, అగ్ని, లోహం, కలప అనే ఐదు మూలకాలను సమతుల్యం చేస్తుంది. దీర్ఘాయువు, ఆరోగ్యం, ఆర్థిక లాభం కోసం ఈ మొక్క ఉపయోగపడుతుందని చెబుతారు. ఆరోగ్యానికి తూర్పు దిశలో, సంపద కోసం ఆగ్నేయ దిశలో ఉంచడం మంచిది.


జమ్మి చెట్టు

జమ్మి చెట్టుకు జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేక స్థానం ఉంది. ఇది శని దేవుడితో సంబంధం కలిగి ఉంటుంది. శనివారం రోజున జమ్మి చెట్టును పూజించడం వల్ల శని ప్రభావం తగ్గుతుందని నమ్మకం. ఇది పనుల్లో అడ్డంకులను తొలగించి, విజయాన్ని తీసుకువస్తుంది. ఇంటి ప్రధాన ద్వారం వద్ద కుడి వైపున ఈ మొక్కను ఉంచాలి.

jammi Plant.jpg

క్రాసులా

క్రాసులా మొక్కను వాస్తు శాస్త్రంలో చాలా శక్తిమంతమైనదిగా భావిస్తారు. దీని మందపాటి, నాణెం లాంటి ఆకులు సంపదను ఆకర్షిస్తాయని నమ్మకం. ఈ మొక్క ఇంట్లో లేదా ఆఫీసులో ఉంటే ఆదాయం పెరుగుతుందని చెబుతారు. వాస్తు దోషాలను తొలగించి, ప్రతికూల శక్తిని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. దీన్ని ఇంటి ప్రధాన ద్వారం వద్ద కుడి వైపున ఉంచితే మంచి ఫలితాలు వస్తాయి.


స్పైడర్ ప్లాంట్

స్పైడర్ ప్లాంట్ అభివృద్ధి, శుభ్రతకు సూచిక. ఇది ఇంట్లో సానుకూల శక్తిని పెంచి, అదృష్టాన్ని తీసుకువస్తుందని నమ్మకం. గాలిని శుద్ధి చేసే గుణం కూడా దీనికి ఉంది. ఈ మొక్కను ఇంటి ఉత్తరం, తూర్పు, ఈశాన్య లేదా వాయవ్య దిశల్లో ఉంచవచ్చు.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించలేదు.

Also Read:

తిన్న వెంటనే నీళ్లు తాగితే ఏమవుతుంది?

జామపండును తొక్కతో తినాలా? లేక తీసేసి తినాలా?

For More Latest News

Updated Date - Jan 22 , 2026 | 06:04 PM