బడ్జెట్ 2026: పన్ను చెల్లింపుదారులకు గుడ్‌న్యూస్ చెబుతారా.. ఈ 4 అంశాలపై సానుకూలంగా స్పందిస్తారా.?
ABN , Publish Date - Jan 22 , 2026 | 05:46 PM
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్-2026ను సమర్పించడానికి సిద్ధమవుతున్నారు. ప్రపంచ భౌగోళిక, రాజకీయ అనిశ్చితి, ట్రంప్ సుంకాల పెంపు, చమురు ధరల్లో హెచ్చు తగ్గులు, మారుతున్న రూపాయి-డాలర్ సమీకరణం నేపథ్యంలో ఈ బడ్జెట్ కోసం చాలా మంది ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్-2026ను సమర్పించడానికి సిద్ధమవుతున్నారు. ప్రపంచ భౌగోళిక, రాజకీయ అనిశ్చితి, ట్రంప్ సుంకాల పెంపు, చమురు ధరల్లో హెచ్చు తగ్గులు, మారుతున్న రూపాయి-డాలర్ సమీకరణం నేపథ్యంలో ఈ బడ్జెట్ కోసం చాలా మంది ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా 2026 బడ్జెట్‌పై వేతన జీవులు, పన్ను చెల్లింపుదారులు దృష్టి సారించారు. నిర్మలమ్మ తమకు గుడ్‌న్యూస్ చెబుతారని ఆశపడుతున్నారు. ముఖ్యంగా వారు ఆశిస్తున్న నాలుగు ప్రధాన మార్పులు(Budget 2026 tax relief) ఏంటంటే..
1. స్టాండర్డ్ డిడక్షన్ పెంపు
పెరుగుతున్న ద్రవ్యోల్బణం జీవన వ్యయాన్ని, నిత్యావసర ధరలను క్రమంగా పెంచుతోంది. ఈ నేపథ్యంలో తమకు మిగిలే నికర ఆదాయం విషయంలో మినహాయింపును పెంచాలని వేతన జీవులు కోరుకుంటున్నారు. పాత పన్ను విధానంలో ఈ పరిమితి రూ.50,000గా, కొత్త పన్ను విధానంలో రూ.75,000గా ఉంది. ఈ పరిమితిని ఈ బడ్జెట్‌లో రూ.1లక్షకు పెంచాలని ఆశిస్తున్నారు(salaried class tax benefits).
2. ఎలక్ట్రిక్ వాహనాల కోసం స్పెషల్ ట్యాక్స్
చాలా మంది ఉద్యోగులు ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేయాలనుకుంటున్నారు. పర్యావరణ హితమైన ఈ చర్యను కంపెనీలు కూడా ప్రోత్సహిస్తున్నాయి. అయితే ప్రస్తుత నిబంధనల ప్రకారం.. కారు ఇంజిన్ సామర్థ్యం ఆధారంగా ట్యాక్స్‌ను లెక్కిస్తున్నారు. ఈ బడ్జెట్‌లో దానిని మార్చాలని ఉద్యోగులు కోరుకుంటున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి ప్రత్యేకమైన, అనుకూలమైన పర్క్విజిట్ వాల్యూయేషన్ నిబంధనలను తీసుకురావాలని కోరుతున్నారు.
3. కొత్త పన్ను విధానం.. హోమ్‌లోన్ వడ్డీపై మినహాయింపు
హోమ్‌లోన్ తీసుకున్న ఉద్యోగులకు వడ్డీపై పన్ను మినహాయింపు లభించే వెసులుబాటు గతంలో ఉండేది. అయితే కొత్త పన్ను విధానంలో దానిని తీసేశారు. ఆ మినహాయింపును మళ్లీ వేతన జీవులకు అందించాలనే డిమాండ్ వస్తోంది. హోమ్‌లోన్‌తో ఇళ్లు కట్టుకుని వాటిల్లో నివసించే వారికి వడ్డీపై మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు(Union Budget 2026).
4. రివైడ్జ్ రిటర్న్స్ గడువు పొడిగింపు
ప్రస్తుతం.. సవరించిన లేదా ఆలస్యమైన ఆదాయపు పన్ను రిటర్న్‌లను డిసెంబర్ 31 వరకు మాత్రమే దాఖలు చేయవచ్చు. విదేశీ ఆదాయం, విదేశీ పెట్టుబడులు ఉన్న వ్యక్తులకు ఈ తుది గడువు సవాలుగా మారుతోంది. ఈ తుది గడువును పెంచితే పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయాన్ని కచ్చితంగా రిపోర్ట్ చేయడానికి వీలుంటుందనే సూచనలు వస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
అవును.. మా దగ్గర రహస్య ఆయుధాలు ఉన్నాయి.. షాకింగ్ న్యూస్ చెప్పిన అమెరికా అధ్యక్షుడు..
మీ బ్రెయిన్‌కు సూపర్ టెస్ట్.. ఈ ఫొటోలో జిరాఫీ ఎక్కడుందో 5 సెకెన్లలో కనిపెట్టండి..