జోగి రమేశ్ ఆస్తుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. తనకు రూ.10 కోట్ల ఆస్తులే ఉన్నాయని ప్రకటించుకున్న ఆయన రూ.25 కోట్లు పెట్టి అంబాపురంలో అగ్రిగోల్డ్ ఆస్తులు కొన్నారా? లేదా ఆక్రమించుకున్నారా? అనే అనుమానాలతో పాటు ఆయన బినామీల ఆస్తులు, మంత్రిగా ఉన్న సమయంలో కొన్న స్థలాల లెక్కలు తీస్తే ఆశ్చర్యం కలగకమానదు.
ఫొటోలో కనిపిస్తున్నది పెనుగంచిప్రోలుకు చెందిన రైతు కటిక నాగేశ్వరరావు. ఎకరం రూ.23 వేల వంతున 4 ఎకరాలు కౌలుకు తీసుకుని మిర్చి సాగు చేశాడు. ఇప్పటికి ఎకరాకు రూ.70 వేల వంతున పెట్టుబడి అయింది. గతనెలలో కురిసిన భారీ వర్షానికి మొక్క కింద పడిపోయింది. పైకి లేపి ప్రాణం పోశారు. పూత, పిందెలతో కళకళలాడుతూ ఎదుగుతున్న తోటలను మొంథా తుఫాను మరోసారి దెబ్బతీసింది. ఈదురుగాలులకు చెట్లు ఒరిగి కొమ్మలు విరిగాయి. పూత రాలిపోయింది. మరల చెట్లను నిలబెట్టినప్పటికీ నిలబడతాయో లేదో కాపు వస్తుందో లేదో తెలియని సందిగ్ధ పరిస్థితి ఏర్పడింది.
ఓవర్ లోడుతో వెళ్తున్న టిప్పర్లు, డంపర్లు ప్రమాదకరంగా మారుతున్నాయి. తెలంగాణాలోని చేవెళ్లలో జరిగిన ప్రమాదం నేపథ్యంలో మన జిల్లాలో పరిస్థితులను పరిశీలిస్తే.. జాతీయ, రాష్ట్ర రహదారులతో పాటు గ్రామీణ రోడ్లలోనూ ఇవి బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇసుక, కంకర, మట్టి, గ్రావెల్ ఏదైనా.. అధిక లోడుతో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా అత్యంత వేగంగా రాకపోకలు సాగిస్తున్నాయి. రాత్రిపూట మరింత వేగం పుంజుకుంటున్నాయి. సరైన ఆజమాయిషీ లేకపోవటంతో వాహనదారులు భయాందోళన చెందుతున్నారు.
విజయవాడలో సంచలనం సృష్టించిన చిన్నారి వైష్టవి కిడ్నాప్, హత్య కేసులో ట్రైల్ కోర్టులో తమకు విధించిన శిక్షను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో పిటిషన్లు వేశారు నిందితులు. అయితే, ఈ కేసులో మోర్ల శ్రీనివాసరావు, యంపరాల జగదీష్ అప్పీళ్లను కొట్టివేసింది హైకోర్టు.
కల్తీ మద్యం కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి జోగి రమేశ్, ఆయన బ్రదర్ రామును నెల్లూరు సెంట్రల్ జైలుకు పోలీసులు సోమవారం తరలించారు. ఈ రోజు తెల్లవారుజామున న్యాయాధికారి రిమాండ్ విధించిన అనంతరం జోగి రమేశ్ ఆయన సోదరుడు రామును విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.
మూడు రోజుల పండుగకు రాష్ట్రం నలుమూలల నుంచి ఏడు నుంచి ఎనిమిది లక్షల మంది పక్షి ప్రేమికులు హాజరవడం ఫ్లెమింగోలతో ఉన్న అనుబంధానికి నిదర్శనమని పవన్ చెప్పుకొచ్చారు. అక్టోబర్ మాసంలో వచ్చి మార్చిలో తిరిగి వెళ్లిపోయే ఈ విదేశీ అతిథులు... ఏపీ ఆతిథ్యం నచ్చిందో ఏమో ఈ మధ్య ఏడాది పొడుగునా కనువిందు చేస్తున్నాయని అన్నారు.
లండన్‌లోని పారిశ్రామికవేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. విశాఖలో ఈ నెల 14,15 తేదీల్లో నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సుకు హాజరుకావాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించనున్నారు.
డైవర్ట్ చేయడానికి ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని దురుద్దేశంతో చేస్తున్నారా అని ప్రశ్నించారు.
అన్ని ఆధారాలతోనే జోగి రమేష్‌ను నకిలీ మద్యం కేసులో అరెస్టు చేయడం జరిగిందని పట్టాభి వెల్లడించారు. వైసీపీ నకిలీ మద్యం వివాదాన్ని పక్కదారి పట్టించేందుకు ఏదో ఒక రకమైన కొత్త గ్రామాలకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తెరలేపుతున్నారని ఆరోపించారు.
ఆస్పత్రి వద్ద జోగి అనుచరులు, వైసీపీ కార్యకర్తలు ఆందోళన చేశారు. ఈ క్రమంలో అక్కడ జరిగిన తోపులాటలో ఆస్పత్రి అద్దాలను జోగి అనుచరులు ధ్వంసం చేశారు.