నగరాభివృద్ధికి నిధుల కేటాయింపునకు దిక్కులు చూస్తున్న కార్పొరేషన్లోని వైసీపీ పాలకపక్షం రూ.కోట్లు ఖర్చుపెట్టి విజ్ఞాన యాత్రలకు మాత్రం సిద్ధమవుతోంది. కార్పొరేటర్ల విజ్ఞాన యాత్ర పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోంది. ఇలా యాత్రలకు వెళ్లినవారు అక్కడ చూసిన అభివృద్ధి, ఇతర అంశాలను నగరంలో ఎక్కడైనా అమలు చేస్తున్నారా అంటే ప్రశ్నార్థకమే. విజ్ఞానయాత్ర అంటూ విహార యాత్రలు చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
అందరి పారిశ్రామికుల సహకారంతో విజయవాడ జవహర్ ఆటోనగర్, కానూరు న్యూఆటోనగర్ను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని ఏపీఐఐసీ హెడ్ఆఫీస్ చీఫ్ జనరల్ మేనేజర్ ఐఎల్ రామ్ తెలిపారు.
మనిషి మేథస్సుతో పోటీపడేదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అని బెజవాడ బార్ అధ్యక్షుడు ఏకే బాషా అన్నారు.
రైతు పరామర్శ పేరుతో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అనుసరిస్తున్న వ్యవహార శైలిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్ జగన్ వ్యవహరించిన తీరును ఈ సందర్భంగా ఉమా ఎండగట్టారు.
జగన్ అధికారంలో ఉండగా అమరావతి రైతులను ముప్పుతిప్పలు పెట్టారని... ఇప్పుడు రైతుల పరామర్శ అంటారా అంటూ మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో మాజీ సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసుల నిబంధనలను వైసీపీ నేతలు ఉల్లంఘిస్తున్నారు. డీజే ఏర్పాటు చేయగా.. అనుమతి లేదని పోలీసులు దాన్ని తీయించారు.
కల్పిత వీడియోల ద్వారా చాలా మందిని ఇబ్బంది పెడుతున్నారని.. అలాంటి వాటిని ఏపీ పోలీసులు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు.
నకిలీ మద్యం కేసులో దర్యాప్తులో పలువురి పాత్రపై ఆధారాలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో నిందితుల జాబితా పెరుగుతోంది. ప్రస్తుతం నిందితుల సంఖ్య 23కు చేరింది.
గోపువానిపాలెంలో మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్, వైసీపీ శ్రేణులు అత్యుత్సాహం ప్రదర్శించారు. పోలీసులతో వైసీపీ నేతలు వాగ్వాదానికి దిగారు.
హైవేపై ఎటువంటి గుమిగూడటం గాని సమావేశాలు నిర్వహించడానికి గాని అనుమతి లేదని డీఎస్పీ సీహెచ్.రాజా తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో హైవేపై వాహన రాకపోకలు, ప్రజా జీవనానికి ఎటువంటి అంతరాయం కలిగించరాదని పేర్కొన్నారు.