అమరావతి రైతులకు తుది విడత ప్లాట్ల కేటాయింపు
ABN , Publish Date - Jan 27 , 2026 | 01:05 PM
ఏపీ రాజధాని అమరావతి రైతులకు ఈనెల 29న మలివిడత ప్లాట్ల కేటాయింపు జరగనుంది. సీడ్ యాక్సిస్ రోడ్డు కోసం భూములిచ్చిన రైతులకు ఈ-లాటరీ ద్వారా ప్లాట్లను కేటాయించనున్నారు.
అమరావతి, జనవరి 27: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు(Amaravati Farmers) జనవరి 29న మలివిడత ప్లాట్ల కేటాయింపు జరుగనుంది. సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు ఈ-లాటరీ విధానం ద్వారా ప్లాట్లు కేటాయించనున్నారు. నిబంధనల ప్రకారం.. పూర్తి పారదర్శకంగా ఈ-లాటరీ పద్ధతిలో ఈ ప్రక్రియను చేపట్టనున్నారు. అయితే ముందుగా ఈ నెల 28న లాటరీ నిర్వహించాలని ప్రణాళిక ఉండగా.. దానిని 29వ తేదీకి వాయిదా వేశారు సీఆర్డీఏ అధికారులు.
సీడ్ యాక్సెస్ రోడ్డు అమరావతి నగరానికి ముఖ్యమైన కనెక్టివిటీ ప్రాజెక్ట్. ఈ రోడ్డు నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వాలని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇటీవల జనవరి 23న రైతులకు లాటరీ ద్వారా భూములు కేటాయించిన విషయం తెలిసిందే. గతంలో భూ సమీకరణ ఉన్న ప్రాంతాల్లో భూములు వచ్చిన రైతుల్లో కొందరు తమకు వేరే చోట భూములివ్వాలని కోరారు. దీంతో ఈ-లాటరీ ప్రక్రియను అనుసరించడంతో పలువురు రైతులు అభ్యంతరాలు తెలిపారు. అయితే వాటిని కూడా పరిగణనలోకి తీసుకున్న సీఆర్డీఏ అధికారులు.. ఈనెల 29న మరోసారి పూర్తిస్థాయిలో ఈ-లాటరీ ద్వారా తుది విడతలో ప్లాట్లను కేటాయిస్తామని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
యువగళానికి మూడేళ్లు.. లోకేశ్‌కు పలువురు నేతల శుభాకాంక్షలు
ఎన్టీఆర్ భవన్‌లో పార్లమెంటరీ కమిటీల శిక్షణ.. ప్రధానంగా వాటిపైనే
Read Latest AP News And Telugu News