మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత కొడాలి నాని అనుచరుడు నకిలీ పోలీసు అవతారం ఎత్తి బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో కొడాలి నాని అనుచరుడిపై పోలీసులకి ఫిర్యాదు అందడంతో రంగంలోకి దిగి ఆటకట్టించారు.
ఏపీలోని 120 సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. ఎన్టీఆర్ జిల్లా, కోనసీమ, ఏలూరు, ప్రకాశం, విశాఖ, నెల్లూరు, శ్రీసత్యసాయి జిల్లా, అన్నమయ్య జిల్లాల్లో ఏకకాలంలో తనిఖీలు జరుగుతున్నాయి.
పార్టీ నాయకులు, కార్యకర్తలకు చెప్పకుండానే ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఈ పర్యటన చేశారు. పార్టీ నాయకులు ఉంటే ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు వీలు పడదని... అందుకే ఈ ఒంటరి పర్యటన అని ఆయన చెప్పుకొచ్చారు.
జగన్ మాట్లాడిన మాటల్లో ఒక్క నిజం కూడా లేదని... కేవలం ప్రభుత్వం మీద బురదజల్లేందుకే జగన్ ప్రయత్నించారని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. జగన్ దిగిన పొలాల్లో ఎక్కడా కూడా వర్షపు నీరు నిలిచిలేదని అన్నారు.
ఏపీకి పట్టిన దరిద్రం జగన్ అని ఎమ్మెల్యే ఆదినారాయణ విమర్శించారు. రాష్ట్రం నుంచి జగన్‌ను పూర్తిగా తరిమికొట్టాలని పేర్కొన్నారు.
ఈసారి ఖరీఫ్ మాసానికి 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనేందుకు సిద్ధం అయ్యామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అంటే రూ.12,200 కోట్లు విలువైన ధాన్యం కొనుగోలుకు సిద్ధం అయినట్లు చెప్పారు.
జగన్.. రైతుల మీదకు దండయాత్రకు వెళ్లారని బుద్దా వెంకన్న అన్నారు. ఓడించారనే అక్కసుతో హేళనగా చూసేందుకు వెళ్లారంటూ మండిపడ్డారు. తుఫాను సమయంలో అసలు జగన్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.
సముద్ర స్నానాలకు విస్తృత ఏర్పాట్లు చేశామని మంత్రి కొల్లురవీంద్ర అన్నారు. లక్ష మంది పైబడి భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని తెలిపారు.
బీఆ (BEEAH) ఫెసిలిటీ, టెక్టాన్ (tecton) ఇంజనీరింగ్, అరబ్ - ఇండియా స్పీసెస్ కంపెనీల ప్రతినిధులతో మంత్రి నారాయణ సమావేశంకానున్నారు. వేస్ట్ మేనేజ్మెంట్, రికవరీ ప్లాంట్‌లు, వైద్య రంగంలో బీఆ (BEEAH)ఫెసిలిటీ సంస్థ ప్రపంచ ప్రసిద్ధి పొందింది.
ఎవరైనా ఏదైనా వ్యాపారం చేసినప్పుడు ఆర్డర్లు రావడం సాధారణం. భారీగా సరుకు సరఫరా చేయాలని ఆర్డర్లు వచ్చినప్పుడు అంత మొత్తం ఎందుకో ఆరా తీస్తారు. ఇది వ్యాపారుల లక్షణం. వన్‌టౌన్‌లోని పులిపాక వారి వీధిలో ప్లాస్టిక్ సీసాల మూతలను విక్రయించే వ్యాపారి మాత్రం భారీగా ఆర్డర్ వచ్చిందనగానే ఎలాంటి ఆరా తీయకుండానే సరుకు సరఫరా చేశాడు. ఆయనే మనోజ్ కుమార్ జైన్. నకిలీ మద్యం తయారీ కేసులో ఏ20 నిందితుడు.