ఆర్ఎస్ఎస్‌కు రాజకీయాలతో సంబంధం లేదు: మోహన్ భగవత్
ABN , Publish Date - Jan 30 , 2026 | 02:31 PM
ఆర్ఎస్ఎస్ మత సంస్థ కాదని.. అలా అని ఏ వర్గానికీ వ్యతిరేకం కాదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. ఆర్ఎస్ఎస్‌లో అన్ని రంగాలకు సంబంధించిన అనుబంధ సంఘాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు..
విజయవాడ, జనవరి30 (ఆంధ్రజ్యోతి): ఆర్ఎస్ఎస్ మత సంస్థ కాదని.. అలా అని ఏ వర్గానికీ వ్యతిరేకం కాదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagwat) స్పష్టం చేశారు. ఆర్ఎస్ఎస్ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయవాడలో భవిష్య భారత్ సమావేశం నిర్వహించారు. స్కూల్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కాలేజీలో భవిష్య భారత్‌పై సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మోహన్ భగవత్ హాజరై ప్రసంగించారు.
ఆర్ఎస్ఎస్‌లో పని చేయాలి..
ఆర్ఎస్ఎస్‌లో అన్ని రంగాలకు సంబంధించి.. అనుబంధ సంఘాలు ఉన్నాయని మోహన్ భగవత్ చెప్పుకొచ్చారు. మీకు ఇష్టం వచ్చిన సంఘంలో చేరి ఆర్ఎస్ఎస్‌లో పని చేయాలని సూచించారు. ప్రపంచంలో అతిపెద్ద వాలంటరీ ఆర్గనైజేషన్ ఆర్ఎస్ఎస్‌కు మాత్రమే ఉందని స్పష్టం చేశారు. ఆర్ఎస్ఎస్‌కు రాజకీయాలతో సంబంధం లేదని తేల్చిచెప్పారు. కొన్ని ప్రభుత్వాలు.. ఆర్ఎస్ఎస్‌లో ప్రభుత్వ ఉద్యోగులు చేరకూడదని నిషేధం విధించాయని.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని తెలిపారు. ఆర్ఎస్ఎస్ దృష్టిలో భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ హిందువేనని చెప్పుకొచ్చారు. భారతదేశ వారసత్వాన్ని, హిందుత్వాన్ని కాపాడాలంటే ఆర్ఎస్ఎస్ వంటి సంస్థతో కలసి పనిచేయటమే మార్గమని మోహన్ భగవత్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏసీబీ మెరుపు సోదాలు.. వాటిపై అధికారుల ఫోకస్..
పర్యాటక రంగాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తాం: హోంమంత్రి అనిత
Read Latest AP News And Telugu News