ఉమెన్ వరల్డ్ కప్ గెలుచుకోవడం ద్వారా భారత దేశ మహిళలు సత్తా చాటారని, మహిళా క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారని ఇండియన్ ఉమెన్ క్రికెటర్ శ్రీచరణిని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు.
క్వాంటం కంప్యూటర్ను వచ్చే జనవరి నుంచే అమరావతిలో ప్రారంభించబోతున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. సీఎఫ్ఎంఎస్ వ్యవస్థ ద్వారా సమర్ధంగా వనరుల్ని వినియోగించగలుగుతున్నామన్నారు.
హర్యానాలో కాంగ్రెస్‌కే ప్రజలు పట్టం కట్టారని తేలిందని షర్మిల తెలిపారు. సర్వేలు కూడా కాంగ్రెస్‌కు అనుకూలంగా ఇచ్చాయని గుర్తుచేశారు. అయినా బీజేపీ ఎలా గెలిచిందో ఇప్పుడు రాహుల్ గాంధి బయట పెట్టారన్నారు.
రైతులు సమీప జిల్లాలోని జిన్నింగ్ మిల్లులలో పత్తి విక్రయించుకునేలా మ్యాపింగ్ చేయాలని కేంద్రమంత్రికి మంత్రి అచ్చెన్నాయుడు లేఖ రాశారు. రైతులు దూరప్రాంతాలకు వెళ్లకుండా ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3 జిన్నింగ్ మిల్లులను ఒకేసారి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని వినతి చేశారు.
విశాఖ వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు కొండారెడ్డి డ్రగ్స్ వాడుతూ ఈగల్ టీంకు దొరికిపోయారని హోంమంత్రి అనిత తెలిపారు. కొండారెడ్డి యువతకు డ్రగ్స్ ఇచ్చి పాడు చేస్తుంటే జగన్ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
అవనిగడ్డ నియోజకవర్గంలో దీవులుగా ఉన్న గ్రామాల రూపురేఖలు మారే సమయం ఆసన్నమైంది. ఇప్పటి వరకు పడవల మార్గం తప్ప ఎలాంటి రవాణా సౌకర్యం లేని దీవుల గ్రామాలకు రాచమార్గం రానుంది. ఇందుకు కృష్ణానదిపై హైలెవర్ వంతెన నిర్మించనున్నారు. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు.
అనుకున్నదే అయ్యింది. ‘ఆంధ్రజ్యోతి’ ముందే చెప్పినట్టు విజయవాడ-మచిలీపట్నం ఎన్‌హెచ్-65 ఆరు వరసల విస్తరణ డీపీఆర్ గందరగోళంగా తయారైంది. కన్సల్టెన్సీ నివేదించిన అంశాలు రెండు జిల్లాల ప్రజాప్రతినిధులు, కలెక్టర్లకు ఆగ్రహం తెప్పించింది. కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రూ.2,500 కోట్ల నిధులు కేటాయిస్తే రూ.1,000 కోట్లకు డీపీఆర్ తయారు చేస్తారా? అంటూ సదరు సంస్థపై మండిపడ్డారు.
్చగన్నవరం, నూజివీడు నియోజకవర్గాలు ఎన్టీఆర్ జిల్లాలో కలుస్తున్నాయా? పెనమలూరు నియోజకవర్గం కృష్ణాజిల్లాకే పరిమితమవుతుందా? కైకలూరును తిరిగి కృష్ణాజిల్లాలోకి తీసుకురానున్నారా?.. అంటే దాదాపు అవుననే సమాధానమే వస్తుంది. జిల్లాల పునర్విభజనకు సంబంధించి మంత్రుల బృందం బుధవారం అమరావతిలో నిర్వహించిన కీలక సమావేశంలో ఈ అంశాలు చర్చకు వచ్చినట్టు తెలిసింది.
సంక్రాంతికి విజయవాడ నుంచి సీ ప్లేన్ సేవలు ప్రారంభంకానున్నాయి. విజయవాడ నుంచి శ్రీశైలంతో పాటు విజయవాడ-హైదరాబాద్, విజయవాడ-విశాఖపట్నం మధ్య కూడా ఈ సర్వీసులు నడపటానికి నిర్ణయించినట్టుగా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు కర్ణాటక రాష్ట్ర న్యాయ విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మక డాక్టర్ ఆఫ్ లాస్ డిగ్రీని ప్రదానం చేసింది. ఈ సందర్భంగా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు.