Share News

జోగి రమేశ్ ఇంటి వద్ద ఏబీఎన్ ఆంధ్రజ్యోతి జర్నలిస్టులపై దాడికి వైసీపీ శ్రేణుల యత్నం

ABN , Publish Date - Feb 01 , 2026 | 06:02 PM

ఇబ్రహీంపట్నంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థలకు చెందిన జర్నలిస్టులపై వైసీపీ మూకలు దాడికి ప్రయత్నించాయి. ఏబీఎన్‌లో మాజీ మంత్రి జోగి రమేశ్ మాట్లాడిన కామెంట్స్ వచ్చిన వెంటనే తమ నేత ఇంటిపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు దాడి చేశాయని ఆరోపణలు చేశారు.

జోగి రమేశ్ ఇంటి వద్ద ఏబీఎన్ ఆంధ్రజ్యోతి జర్నలిస్టులపై దాడికి వైసీపీ శ్రేణుల యత్నం
ABN Andhrajyothy

అమరావతి, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): ఇబ్రహీంపట్నంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థలకు చెందిన జర్నలిస్టులపై వైసీపీ మూకలు దాడికి ప్రయత్నించాయి. ఏబీఎన్‌లో మాజీ మంత్రి జోగి రమేశ్ మాట్లాడిన కామెంట్స్ వచ్చిన వెంటనే తమ నేత ఇంటిపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు దాడి చేశాయని ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థలకు చెందిన జర్నలిస్టులపై జరుగుతున్న దాడిని అక్కడికి వచ్చిన టీడీపీ కార్యకర్తలు, స్థానికులు అడ్డుకున్నారు. పోలీసులు వెంటనే చర్యలు చేపట్టారు. పోలీసులు అక్కడకు చేరుకుని వైసీపీ కార్యకర్తలను దూరంగా పంపించివేశారు. జోగి రమేశ్ నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

బడ్జెట్‌లో ఏపీకి భారీ నిధులు.. అమరావతికి ప్రత్యేక ప్యాకేజీ

చరిత్రలో లేని మెజార్టీ కూటమికే దక్కింది: సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 01 , 2026 | 06:21 PM