ఉయ్యూరు- మచిలీపట్నం జాతీయ రహదారిపై మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గండిగుంట సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు.
తిరుమల లడ్డూ తయారీలో నకిలీ నెయ్యి వాడకంపై లంకా దినకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి సీబీఐ విచారణలో వాస్తవాలు బయటకు వచ్చాయని అన్నారు.
మంత్రులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అభినందించారు. మొంథా తుఫాను సమయంలో అంతా బాగా పనిచేశారని.. ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించామని అన్నారు.
కొత్త ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించాలని తెలుగు దేశం మంత్రులకు మంత్రి లోకేష్ సూచించారు. అలాగే విశాఖ సీఐఐ సదస్సుపై కూడా మంత్రులతో జరిగిన సమావేశంలో లోకేష్ చర్చించారు.
మొంథా తుఫాను కారణంగా రాయలచెరువుకు గండి పడి ఊరిని మొత్తం ముంచెత్తింది. భారీగా నీరు రావడంతో పెద్దఎత్తున పశువులు మృత్యువాతపడ్డాయి. ఈ క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
కార్తీక మాసం మూడో సోమవారం సందర్భంగా శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజామునే భక్తులు శివాలయాలకు చేరుకుని మహాదేవుడిని దర్శించుకుంటున్నారు.
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుంచి ప్రతిభ ఆధారంగా ఢిల్లీ వెళ్లిన 52 మంది విద్యార్థులు ఇవాళ(ఆదివారం) తిరిగి వచ్చారు. విద్యార్థులను ఎంపిక చేసి మూడు రోజులు పాటు ఢిల్లీ పర్యటనకు పంపిన మంత్రి నారా లోకేశ్‌కు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కృతజ్ఞతలు తెలిపారు.
ఏపీ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలుగుదేశం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ఆదివారం విజయవాడలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎంపీ శివనాథ్ పాల్గొన్నారు.
వాట్సాప్ వేదికగా మరో నయా మోసం వేళ్లూనుకుంటోంది. ఓ ట్రస్టు పేరిట వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేయడమే కాకుండా.. అందులో చాలామందిని యాడ్ చేసి, అదిరిపోయే ఆఫర్లంటూ డబ్బు పిండే ప్రయత్నం చేస్తున్నారు. విజయవాడతో పాటు జిల్లావ్యాప్తంగా పెరుగుతున్న ఈ ఆన్‌లైన్ మోసం ఇప్పుడు కలవరపెడుతోంది.
ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ లడ్డూ ప్రసాదాన్ని ఇకపై గ్రామ సచివాలయాల్లో బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించాలని అధికారులు నిర్ణయించారు. భవానీ దీక్షల విరమణ ఉత్సవాల్లో ఈ ప్రణాళికను అమలు చేయాలని భావిస్తున్నారు.