Share News

తిరుమలతో రాజకీయం చేస్తే వినాశనం తప్పదు.. వైసీపీకి భానుప్రకాష్ వార్నింగ్

ABN , Publish Date - Feb 04 , 2026 | 01:46 PM

వైసీపీ నేతలపై భానుప్రకాష్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలతో రాజకీయాలు చేస్తే వినాశనం తప్పదని హెచ్చరించారు. టార్గెట్ తిరుమలగా వైసీపీ నేతలు పని చేస్తున్నారని విమర్శించారు..

తిరుమలతో రాజకీయం చేస్తే వినాశనం తప్పదు.. వైసీపీకి భానుప్రకాష్ వార్నింగ్
Bhanu Prakash Reddy

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: వైసీపీ నాయకులపై టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి (Bhanu Prakash Reddy) తీవ్ర విమర్శలు గుప్పించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. హిందువుల ఆరాధ్య దైవం కలియుగ వేంకటేశ్వర స్వామి, హిందువుల ఆధ్యాత్మిక రాజధాని తిరుమల క్షేత్రాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచాలని సూచించారు. తిరుమల చుట్టూ రాజకీయాలు తిరిగితే వినాశనమే జరుగుతుందన్నారు. వైసీపీ నాయకులు తిరుమల చుట్టూ గిరిప్రదక్షిణ చేసి పుణ్యం సంపాదించుకోవాలని వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రజలు ఇప్పటికే వైసీపీని 11 స్థానాలకు పరిమితం చేశారని, అయినా సిగ్గు లేకుండా స్వామివారితో రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


ప్రజాస్వామ్యంలో ఉన్నామా...

వైసీపీ హయాంలో తిరుమల లడ్డూలో నెయ్యి కాకుండా కల్తీ పదార్థాలు వాడారని సిట్ నివేదికలో స్పష్టంగా ఉందని భాను ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. కొందరు వైసీపీ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని, ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక రాక్షస పాలనలో ఉన్నామా అని ప్రశ్నించారు. వైసీపీ నేతలకు జైత్రయాత్ర అనేది లేదని, ఎన్నడూ లేని విధంగా దీపావళికి జగన్ మోహన్ రెడ్డి టపాసులు కాల్చారని విమర్శించారు. టపాసులు కాల్చుకోవడానికి వైసీపీ నేతల శేష జీవితం సరిపోతుందని ఆయన సెటైర్ వేశారు.


తిరుమలే టార్గెట్‌గా..

2019-2024 మధ్య ఆంధ్రప్రదేశ్‌ను అప్పుల పాలు చేశారని భాను ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతుంటే జగన్ మోహన్ రెడ్డి ఓర్వలేకపోతున్నారని అన్నారు. టార్గెట్ తిరుమలగా వైసీపీ నేతలు పని చేస్తున్నట్లు విమర్శించారు. వైసీపీ దుర్మార్గులు ఇప్పుడు ఏపీ మీద పడ్డారన్నారు. పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి వస్తున్నారని.. వైసీపీ నేతలు ఏడుస్తున్నారని వ్యాఖ్యానించారు. వైసీపీ పాలనలో దృతరాష్ట్రుడి పాలన జరిగిందంటూ ఆయన వ్యాఖ్యానించారు.


అందరూ బయటకొస్తారు..

సిట్ నివేదికలో కోట్ల రూపాయలు హవాలా మార్గంలో చేతులు మారాయని తేలిందని భాను ప్రకాష్ రెడ్డి అన్నారు. కల్తీ నెయ్యి వెనుక ఉన్న కుట్రదారులు, పాత్రధారులు బయటకు వస్తారని తెలిపారు. కుల రాజకీయాలకు ఆంధ్రప్రదేశ్‌ను వేదికగా చేసుకోవద్దని సూచించారు. ఆంబోతులను రోడ్లపైకి వచ్చి.. ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఈరోజు ఇంకో నాయకుడు (జగన్) గుంటూరుకు బయలుదేరారని చెప్పారు. రోడ్డుపై ఆంబోతులు గొడవ చేస్తే వదిలేస్తామా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆందోళనలు.. జగన్ ప్రీ ప్లాన్ స్కెచ్‌గా భావిస్తున్నామని తెలిపారు. తాడేపల్లి నుంచి వచ్చిన ఆదేశాల మేరకే గందరగోళం చేస్తున్నారని భాను ప్రకాష్ రెడ్డి ఆరోపించారు.


మనిషిలా ప్రవర్తించాలి...

2019 నుంచి 2024 వరకు తిరుమలలో చేసిన అపచారాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని భాను ప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. వైవీ సుబ్బారెడ్డి ఢిల్లీకి వచ్చి కల్తీ నెయ్యిపై నీతులు మాట్లాడుతున్నారని విమర్శించారు. భవిష్యత్తులో తామే అధికారంలోకి వస్తామని వైసీపీ నేతలు అనుకుంటున్నారని.. భోగి పండుగకు డ్యాన్సులు, దీపావళికి టపాసులు తప్ప జైత్రయాత్ర చేసేది లేదని వ్యంగ్యంగా విమర్శించారు. మనిషిలాగా ప్రవర్తించాలి కాని ఆంబోతులాగా కాదని టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి సూచించారు.


ఇవి కూడా చదవండి..

రాజమండ్రిలో కలకలం.. స్కూల్ వైపు వెళ్లిన పెద్దపులి..

అనుమతి లేకున్నా.. గుంటూరుకు జగన్.. భారీగా ట్రాఫిక్ జామ్..

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 04 , 2026 | 02:10 PM