Share News

రాజమండ్రిలో కలకలం.. స్కూల్ వైపు వెళ్లిన పెద్దపులి..

ABN , Publish Date - Feb 04 , 2026 | 07:18 AM

రాజమండ్రిలో పెద్దపులి కలకలం సృష్టిస్తోంది. పెద్ద పులి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వైపు వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఓ చోట పెద్దపులి తిరుగుతుండగా కారులో నుంచి కొంతమంది యువకులు వీడియో తీశారు..

రాజమండ్రిలో కలకలం.. స్కూల్ వైపు వెళ్లిన పెద్దపులి..
Tiger spotted

రాజమండ్రి, ఫిబ్రవరి 4: కొద్ది రోజుల నుంచి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో పెద్దపులి కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా, దివాన్ చెరువు సెంటర్ సమీపంలో పెద్దపులి సంచరిస్తూ కనిపించింది. జాతీయ రహదారి పక్కనే ఉన్న ఎస్‌వీపీసీ ఫంక్షన్ హాల్ దగ్గర కూడా జనాలకు కనిపించింది. పెద్ద పులి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వైపు వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఓ చోట పెద్దపులి తిరుగుతుండగా కారులో నుంచి కొంతమంది యువకులు వీడియో తీశారు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గాడాల దగ్గర పెద్దపులి పాదముద్రలు కనిపించటంతో అధికారులు బోన్ ఏర్పాటు చేశారు.


మొన్నటి వరకు ఏలూరు జిల్లా ఏజెన్సీని వణికించిన పెద్దపులి ఇప్పుడు తూర్పు గోదావరిలోకి ప్రవేశించింది. ఫిబ్రవరి 1న రాజమహేంద్రవరం రూరల్ తొర్రేడులో పశువులపై దాడి చేసి చంపేసింది. పులి దాడిపై స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు మీడియా సమావేశం నిర్వహిస్తుండగా.. వారి వెనకాలే కనిపించింది. ఇక, నెల్లూరు జిల్లా దత్తలూరు మం‌డలం నందిపాడులోనూ పెద్దపులి కలకలం సృష్టిస్తోంది. రేమానుకుంట వద్ద స్థానికులకు కనిపించింది. దీంతో ఉదయగిరి పరిసర ప్రాంతాలవారు భయాందోళనలో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

ఆ ఏరియా వాసులకు బిగ్ అలెర్ట్.. 10 గంటల నుంచి కరెంట్ కట్

లోయలో పడ్డ బస్సు.. ముగ్గురు మృతి.. ఏడుగురికి తీవ్ర గాయాలు..

Updated Date - Feb 04 , 2026 | 07:47 AM