ఆ ఏరియా వాసులకు బిగ్ అలెర్ట్.. 10 గంటల నుంచి కరెంట్ కట్
ABN , Publish Date - Feb 04 , 2026 | 07:00 AM
నగరంలోని కొన్ని ఏరియాల్లో బుధవారం ఉదయం పది గంటలనుంచి విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు ట్రాన్స్ కో అధికారులు తెలిపారు. విద్యుత్ లైన్ల మరమ్మతులు, ఆతర పనుల నిమిత్తం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు తెలిపారు.
- నగరంలో.. నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలివే..
హైదరాబాద్: బంజారాహిల్స్ ఏడీఈ(Banjara Hills ADE) పరిధిలోని పలు ప్రాంతాల్లో బుధవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ జి.గోపీ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 11కేవీ బీఎస్ఎన్‌ఎల్ కార్యాలయం, పీఈఐ ఓహెచ్, జలగం వెంగళరావు పార్క్ ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాలు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 11కేవీ బంజారాహిల్స్ రోడ్డు నెంబర్.1 పాత ఆంధ్రజ్యోతి కార్యాలయం, శ్రీనగర్ కాలనీ హెచ్‌పీ గ్యాస్ కార్యాలయం ఫీడర్ల పరిధిలోని ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏడీఈ పేర్కొన్నారు.
గ్రీన్‌ల్యాండ్స్ ఏడీఈ పరిధిలో..
గ్రీన్‌ల్యాండ్స్ ఏడీఈ(Greenlands ADE) పరిధిలోని పలు ప్రాంతాల్లో బుధవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ ఎల్.వి.సత్యనారాయణ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 11కేవీ ఐఏఎస్ క్వార్టర్స్ ఫీడర్ పరిధి, ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 11కేవీ కార్మిక నగర్ ఫీడర్ పరిధి, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 11కేవీ కుందన్ బాగ్, మైత్రివనం ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏడీఈ పేర్కొన్నారు.
సైఫాబాద్ ఏడీఈ పరిధిలో..
సైఫాబాద్ ఏడీఈ(Saifabad ADE) పరిధిలోని పలు ప్రాంతాల్లో నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ సుధీర్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 11కేవీ అల్ ఇండియా రేడియో, హాకా భవన్, బాలాజీ ఇంద్రప్రస్థ అపార్ట్‌మెంట్ ఫీడర్ల పరిధి, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 11కేవీ సోమాజిగూడ విజయ ఆస్పత్రి, ఈనాడు కార్యాలయం ఫీడర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏడీఈ పేర్కొన్నారు.
సైదాబాద్: టీఎస్ఎస్పీడీసీఎల్ ఆస్మాన్‌ఘడ్ డివిజన్ పరిధిలోని మరమ్మతు పనుల కారణంగా బుధవారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని డీఈ తెలిపారు. 11కేవీ సైదాబాద్ కాలనీ ఫీడర్ పరిధిలోని పరిసర ప్రాంతాల్లో ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, శంకేశ్వర్ బజార్, సాయిబాబా టెంపుల్, శ్రీపురం కాలనీ, ప్రశాంత్ నగర్ ఫీడర్ల పరిధిలోని పరిసర ప్రాంతాల్లో ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జయనగర్, ఎస్‌బీఐ కాలనీ ఫీడర్ల పరిధిలోని పరిసర ప్రాంతాల్లో మధ్యాహ్నం 2గంటఅల నుంచి సాయత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని డీఈ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి.
స్వల్పంగా పెరిగిన బంగారం.. మరింత తగ్గిన వెండి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
థియేటర్లపై.. సినిమాల దండయాత్ర! తెలుగులోనే డజన్.. ఎలా చూడాల్రా నాయనా
Read Latest Telangana News and National News