Share News

అమెరికాతో వాణిజ్య ఒప్పందం భారత్‌కు ‘గేమ్ ఛేంజర్: టీడీపీ ఎంపీ

ABN , Publish Date - Feb 03 , 2026 | 04:01 PM

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ మరో చరిత్రాత్మక ఆర్థిక విజయాన్ని సాధించిందని ఎంపీ సానా సతీష్ బాబు అన్నారు. భారత్- అమెరికా ట్రేడ్ డీల్ ప్రధాని దూరదృష్టి గల నాయకత్వానికి మరో నిదర్శనంగా నిలిచిందన్నారు.

అమెరికాతో వాణిజ్య ఒప్పందం భారత్‌కు ‘గేమ్ ఛేంజర్: టీడీపీ ఎంపీ
TDP MP Sana Satish

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: అమెరికా పన్నుల తగ్గింపు దేశ ఆర్థిక వ్యవస్థకు ‘గేమ్ ఛేంజర్’ అని టీడీపీ రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు పేర్కొన్నారు. మంగళవారం నాడు మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ మరో చరిత్రాత్మక ఆర్థిక విజయాన్ని సాధించిందని అన్నారు. భారత్- అమెరికా ట్రేడ్ డీల్ ప్రధాని మోదీ దూరదృష్టి గల నాయకత్వానికి మరో నిదర్శనంగా నిలిచిందన్నారు. ఆసియా దేశాల్లోనే భారత్‌కు అత్యల్ప పన్ను శాతం వర్తించడం విశేషమన్నారు. దీని వల్ల 'Made in India' ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో మరింత పోటీ సామర్థ్యం పెరుగుతుందని ఎంపీ వివరించారు.


ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్‌కు, ముఖ్యంగా తీరప్రాంతాలకు భారీ లాభాలు చేకూరుస్తుందని ఎంపీ సంతోషం వ్యక్తం చేశారు. కాకినాడ నుంచి ఎగుమతి అయ్యే ఆక్వా, సముద్ర ఆహార ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్లకు మరింత సులభంగా చేరుకునే అవకాశం ఏర్పడిందన్నారు. దీని ద్వారా వేలాది మంది మత్స్యకారులు, రొయ్యల రైతులు, ఎగుమతిదారులకు ఆర్థిక భద్రతతో పాటు కొత్త ఆశలు కలుగుతాయని అన్నారు.


ఈ ట్రేడ్ డీల్ భారత్- అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందన్నారు. భారత్‌ను గ్లోబల్ ట్రేడ్ హబ్‌గా తీర్చిదిద్దే కీలక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇలాంటి దేశహితమైన నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి టీడీపీ ఎంపీ సానా సతీష్ బాబు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.


ఇవి కూడా చదవండి...

టీటీడీ కల్తీ నెయ్యి కేసు.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం..

నెయ్యి కల్తీ వ్యవహారం.. ఏపీ కేబినెట్‌లో సిట్ నివేదికపై చర్చ

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 03 , 2026 | 04:53 PM