Home » Andhra Pradesh » Kadapa
సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియాలో ఇన్వెస్ట్‌మెంటు పేరుతో నకిలీ యాప్‌లు ప్రవేశపెట్టి.. ఇందులో పెట్టుబడి పెడితే అధిక మొత్తంలో డబ్బులు వస్తాయంటూ ఆశలు రేకెత్తించి కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారు.
కూటమి ప్రభుత్వం మహిళలకు 15వ తేదీ శుక్రవారం నుంచి ఉచిత బస్సు ప్రయాణాన్ని చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఈ పథకానికి ఎలాంటి ఆటుపోట్లు ఎదురు కాకుండా పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు కడప రీజియన్ పరిధిలోని బస్సులను పూర్తి సన్నద్ధం చేశామని ఆర్ఎం గోపాల్ రెడ్డి తెలిపారు.
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ ఆదేశించారు. మంగళవారం రిమ్స్ సమీపంలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్శిటీ పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. జడ్పీటీసీ ఉప ఎన్నికల కౌంటింగ్ గురువారం ఉదయం 8గంటలకు ప్రారంభం అవుతుందని చెప్పుకొచ్చారు.
వర్షం కురిస్తే చాలు అటు హోమియోపతి వైద్యశాల, ఇటు ఆరోగ్య ఉపకేంద్రంలో సిబ్బంది గుండెలదిరి పోతుంటాయి. ఎప్పుడో 40 ఏళ్ల కిందట నిర్మించి న భవనాలు కావడంతో పెచ్చులూడి, భవనాలు మొత్తం ఉరుస్తున్నాయి. దీంతో ఆరుబయటే చెట్ల కింద రోగులకు వైద్య సేవలు అం దించాల్సిన దుస్థితి నెలకొం ది.
మండలంలో రీసర్వే త్వరగా చేపట్టాలని మద నప ల్లె సబ్‌కలెక్టర్ చల్లా కళ్యాణి సూచించారు
ఖరీఫ్‌లో సాగు చేసి పంటలన్నింటికీ విధి గా ఈ పంట నమోదు చేయాలని జిల్లా వ్యవసాయాధికారి శివనారాయణ సూచిం చారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నడుమ చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ అవినాష్ రెడ్డిని పులివెందుల వైసీపీ ఆఫీస్‌కు పోలీసులు తరలించారు.
టీడీపీకి అనుకూలంగా ఓటు వేయెుద్దంటూ కేకలు పెడుతూ కారు ధ్వంసం చేశారు వైసీపీ గూండాలు. దీంతో ఓటర్లు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మరోవైపు ఒంటిమిట్టలోని చింతరాజుపల్లె, రాచపల్లిలో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.
ఉమ్మడి కడప జిల్లాలో మంగళవారం పులివెందుల, ఒంటిమిట్ట రెండు స్థానాల్లో జడ్పీటీసీ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నికల పోలింగ్ ఇవాళ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం ఐదు గంటల వరకు బ్యాలెట్ విధానంలో ఓటింగ్ జరుగనుంది.
మరికొన్ని గంటల్లో పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. అలాంటి వేళ.. వైసీపీకి ఏపీ హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది.