Share News

IAS Shiva Shankar: క్యాట్ ఆగ్రహం.. శివశంకర్ ఐఏఎస్‌ను ఏపీకి కేటాయించాలని ఆర్డర్

ABN , Publish Date - Aug 07 , 2025 | 07:32 PM

శివశంకర్‌ను నాలుగు వారాల్లోగా ఏపీకి కేటాయించాలంటూ.. క్యాట్ ఆదేశాలు జారీ చేసింది. శివశంకర్‌ను ఏపీకి బదిలీ చేయాలని హైకోర్టు జూలై 3న ఉత్తర్వులు జారీ చేసింది. ఆ గడువు జూలై 31తో ముగిసింది. అయితే.. ఇప్పటికీ ఉత్తర్వులు అమలు చేయకపోవడంపై శివశంకర్ క్యాట్‌ను ఆశ్రయించారు.

IAS Shiva Shankar: క్యాట్ ఆగ్రహం.. శివశంకర్  ఐఏఎస్‌ను ఏపీకి కేటాయించాలని ఆర్డర్
Siva Shankar

ఢిల్లీ: ఐఏఎస్ అధికారి శివశంకర్ లోతేటి విషయంలో కేంద్ర కార్యదర్శిపై క్యాట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐఏఎస్ అధికారి శివశంకర్‌ను ఏపీకి కేటాయించాలన్న హైకోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడంపై క్యాట్ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఈ విషయంలో డీఓపీటీ సెక్రటరీపై ఆగ్రహం వ్యక్తం చేసిన క్యాట్.. కోర్టు ధిక్కరణ చట్టం కింద నోటీసులు జారీ చేసింది.


శివశంకర్‌ను నాలుగు వారాల్లోగా ఏపీకి కేటాయించాలంటూ.. క్యాట్ ఆదేశాలు జారీ చేసింది. శివశంకర్‌ను ఏపీకి బదిలీ చేయాలని హైకోర్టు జూలై 3న ఉత్తర్వులు జారీ చేసింది. ఆ గడువు జూలై 31తో ముగిసింది. అయితే.. ఇప్పటికీ ఉత్తర్వులు అమలు చేయకపోవడంపై శివశంకర్ క్యాట్‌ను ఆశ్రయించారు. శివశంకర్ తరుఫు న్యాయవాది పదిరి రవితేజ తన వాదనలును బలపరిచారు. విచారణకు డీఓపీటీ సెక్రటరీ బదులు డిప్యూటీ సెక్రటరీ హాజరుకావడంతో క్యాట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు వారాల్లోగా ఉత్తర్వులు అమలు చేయాలని, లేని పక్షంలో డీఓపీటీ సెక్రటరీ జీతాన్ని నిలిపివేస్తామని క్యాట్ హెచ్చరించింది.


ఈ వార్తలు కూడా చదవండి

ఏపీలో అనుకోని ప్రమాదం... అప్రమత్తమైన అధికారులు

మంగళగిరిలో సీఎం చంద్రబాబు పర్యటన.. మూడు పథకాలకు శ్రీకారం

Updated Date - Aug 07 , 2025 | 07:32 PM