YS Vivekananda Reddy: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో.. ప్రధాన సాక్షి సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Aug 06 , 2025 | 04:15 PM
మాజీ సీఎం జగన్ మాటలతో జిల్లాలో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారని వివేకా హత్య కేసు సాక్షి దస్తగిరి అన్నారు. మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, తమ్ముడు అహ్మద్ బాషా అండతో.. రాయచోటిలోని జగన్ అనుచరులు భూకబ్జాలు చేశారని ఆరోపించారు
కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కీలక విషయాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి మాజీ సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో రాష్ట్రంలో అనేక అక్రమాలు, దందాలు జరిగాయని ఆరోపించారు.
మాజీ సీఎం జగన్ మాటలతో జిల్లాలో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారని వివేకా హత్య కేసు సాక్షి దస్తగిరి అన్నారు. మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, తమ్ముడు అహ్మద్ బాషా అండతో.. రాయచోటిలోని జగన్ అనుచరులు భూకబ్జాలు చేశారని ఆరోపించారు. రాయచోటిలో జాఫర్‌బేగ్ అనే వ్యక్తి స్థలాన్ని అంజాద్ కబ్జా చేశారని పేర్కొన్నారు. కబ్జాపై జాఫర్‌బేగ్ కోర్టుకు వెళ్లగా ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చిందన్నారు. దాంతో జాఫర్‌బేగ్‌పై వైసీపీ నాయకులు దాడి చేసి బెదిరించారని పేర్కొన్నారు. వైసీపీ హయాంలో నష్టపోయిన బాధితులను కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని దస్తగిరి కోరారు.
అయితే నిన్న వివేకా హత్య కేసు దర్యాప్తు పూర్తయినట్లు సుప్రీంకోర్టుకు సీబీఐ తెలిపింది. ఒక వేళ సుప్రీంకోర్టు ఆదేశిస్తే తదుపరి విచారణ కొనసాగిస్తామని చెప్పింది. కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుణంగా ముందుకువెళ్తామని సీబీఐ వెల్లడించిన విషయం తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
ఒక పార్టీని టార్గెట్ చేస్తారా.. ఎంపీపై సుప్రీం అసహనం, రూ.10 లక్షల జరిమానా
విమానాశ్రయాలకు ఉగ్రముప్పు.. హై అలర్ట్