Home » Andhra Pradesh » Guntur
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎన్నారై గ్లోబల్ టీడీపీ కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం బుధవారం జరిగింది. ఎన్నారై గ్లోబల్ టీడీపీ అధ్యక్షుడిగా పి. గురు రాజాతోపాటు సభ్యులతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేయించారు.
మూడేళ్ల క్రితం స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్టు చేయడం ఓ సైకో నిరంకుశత్వానికి ఇదొక నిదర్శనమని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖల మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.
హస్తకళాకారుల అభివృద్ధికి కామన్ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. క్లస్టర్ల వారీగా కామన్ ఫెసిలిటీ సెంటర్ల ఏర్పాటుకు వేగంగా అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో కూటమి గెలవాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. కొందరు దింపుడు కళ్లెం ఆశతో ‘సర్’ పైనా, రిజర్వేషన్లపైనా కోర్టులకు వెళ్లారని విమర్శించారు.
తమ పార్టీ నేతలు సోషల్ మీడియాను సమర్థంగా వినియోగించాలని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి, తెలుగుదేశం పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ దిశానిర్దేశం చేశారు. సోషల్ మీడియానే కదా అని తేలిగ్గా తీసుకోవద్దని... ఈ విషయంపై సీరియస్‌గా ఉండాలని ఆదేశించారు.
గొడ్డలి పార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఊపేక్షించవద్దని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీలో చేసిన అభివృద్ధి-సంక్షేమం గురించి చెప్పుకోవాలి... గొడ్డలి పార్టీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని పేర్కొన్నారు.
వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై పార్లమెంట్ సభ్యులు చింతకాయల విజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉపాధ్యాయుల పట్ల జగన్‌కు ఏమాత్రం గౌరవం లేదని విమర్శించారు.
టీడీపీ లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. స్థానిక ఎన్నికలను తేలిగ్గా తీసుకోకుండా గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.
పార్టీయే సుప్రీం అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. పార్టీ పదవుల్లో ఉన్న వారిని మంత్రులైనా.. ఎమ్మెల్యేలైనా గౌరవించాల్సిందేనని ఆదేశించారు.
తాను ఏర్పాటు చేయబోయే నూతన రాజకీయ పార్టీ జెండా, అజెండా ప్రకటించే ముందు ప్రజలకు సంబంధించిన అంశాలను వివరిస్తానని మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఏపీలో మూడవ ప్రత్యమ్నాయం అవసరాన్ని ప్రజలకు వివరిస్తానని పేర్కొన్నారు.