Share News

Cyclone Montha: మొంథా తుఫాన్.. కంట్రోల్ రూమ్‌ నెంబర్లు ఇవే

ABN , Publish Date - Oct 26 , 2025 | 05:09 PM

మొంథా తుఫాన్ నేపథ్యంలో కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. ఈ తుఫాన్ ప్రభావిత జిల్లాలకు ప్రత్యేక అధికారులను సైతం ప్రభుత్వం నియమించింది.

Cyclone Montha: మొంథా తుఫాన్.. కంట్రోల్ రూమ్‌ నెంబర్లు ఇవే

కోస్తా జిల్లాలను మొంథా తుఫాన్ అతలాకుతలం చేయనుందని ఇప్పటికే రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ తుఫాన్ కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారనుందని.. మత్స్యకారులు చేపల వేటకు వెళ్ల వద్దని హెచ్చరించింది. అవసరం అయితేనే తప్ప బయటకు రావద్దని ప్రజలకు సూచించింది. అలాగే విపత్తుల నిర్వహణ సంస్థ స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు 112, 1070, 1800 425 0101 ఏర్పాటు చేసినట్లు ఆ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు.


ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం.. గడిచిన 6 గంటల్లో గంటకు 5 కి. మీ వేగంతో కదులుతొందని తెలిపారు. మరో 12 గంటల్లో నైరుతి, పశ్చిమ - మధ్య బంగాళాఖాతంలో ఇది తుఫానుగా బలపడుతుందని చెప్పారు. మంగళవారం ఉదయానికి ఇది తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వివరించారు. ప్రస్తుతానికి చెన్నైకి 770 కి. మీ, విశాఖపట్నానికి 820 కి. మీ, కాకినాడకి 810 కి. మీ దూరంలో కేంద్రీకృతమైందని పేర్కొన్నారు.


రేపు అంటే సోమవారం కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పు గోదావరి జిల్లాలతోపాటు ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వివరించారు.


ఎల్లుండి నుంచి అంటే.. మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ వర్ష ప్రభావంతో.. బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొన్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని.. ఇంట్లోనే సురక్షితంగా ఉండాలంటూ ప్రజలకు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.


కంట్రోల్ రూమ్ నెంబర్లు ఇవే..

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్ నెంబర్లు: 112, 1070, 1800 425 0101

  • శ్రీకాకుళం: 08942-240557

  • విజయనగరం: 08922-236947

  • విశాఖపట్నం: 0891-2590102/100

  • అనకాపల్లి: 089242-22888

  • కాకినాడ: 0884-2356801

  • డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ: 08856-293104

  • పశ్చిమ గోదావరి: 08816-299181

  • కృష్ణ: 08672- 252572

  • బాపట్ల: 08643-220226

  • ప్రకాశం: 9849764896

  • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు: 0861-2331261, 7995576699

  • తిరుపతి: 0877- 2236007


ఈ వార్తలు కూడా చదవండి..

మొంథా తుపాన్.. అధికార యంత్రాంగం అప్రమత్తం: సీఎం చంద్రబాబు

ఏపీకి పొంచి ఉన్న ముప్పు.. ఈ ప్రాంత ప్రజలు జాగ్రత్త..!

For More AP News And Telugu News

Updated Date - Oct 26 , 2025 | 05:48 PM