ఉమ్మడి జిల్లా అధిక ఉష్ణోగ్రతలతో ఉడికిపోతోంది. ఎండకు తాళలేక జనం తల్లడిలిపోతున్నారు. ఎండల తీవ్రత అనూహ్యంగా పెరగడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. నిప్పుల కొలిమిలా వాతావరణం మారడంతో ఇంటి నుంచి బయటకు రావడానికి సాహసించలేకపోయారు. పల్లెలు, పట్టణాల్లో జనం ఎండ వేడిమికి అల్లాడిపోతున్నారు. సీసీ రోడ్లు సెగలు గక్కాయి. ఉష్ణోగ్రతలు పెరగడంతో రవాణా సౌకర్యాలు సైతం స్తంభించిపోయాయి. ఆటోలు, బస్సులు, ప్రయాణికులు లేక వెలవెలబోయాయి. విద్యుత్ కోతలు పెరిగిపోయాయి. పలు చోట్ల తీవ్రమైన ఉష్ణోగ్రతలకు ట్రాన్స్ఫార్మర్లు ట్రిప్ అయి విద్యుత్ సరఫరాలో అం
సూర్య ప్రతాపం ఏమాత్రం తగ్గలేదు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో శనివారం కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే ముందురోజుతో పోలిస్తే కొంత మెరుగు. శుక్రవారం రాత్రి నుంచి వివిధ ప్రాంతాల్లో ఈదురుగాలులు, చిరుజల్లులు పడ్డాయి. దీంతో ఉదయం పూట కాస్త చల్లగానే ఉన్నప్పటికీ మధ్యాహ్నం నాటికి ఎండ తీవ్రత పెరిగింది. సాయంత్రం కూడా వేడి తగ్గని పరిస్థితి ఉంది.
మలికిపురం/అల్లవరం,మే23(ఆంధ్రజ్యోతి): ఆక్వా సాగు పూర్తిగా సంక్షోభంలో పడిపోయింది. కొద్దిరోజులుగా దారుణంగా పడిపోతున్న ఆక్వా ధరలను చూసి ఆక్వా రైతాంగం గుండె చెరువవుతోంది. ఇప్పటికే రొయ్యల తెగుళ్ల మందులు, మేత ధరలు పెంచి విక్రయాలు సాగిస్తుండడంతోపాటు విద్యుత్ సరఫరా ఇబ్బందులు కూడా రైతాంగాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వీటికితోడు వాతావరణ మార్పులు మరింత ఆందోళన కు గురిచేస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా గోదావరి పుష్కరాల ఏర్పాట్లను పరిశీలించి, అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం అనాతవరం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. 216వ జాతీయ రహదారి ఆర్టీసీ బస్సు, కారు ఢీకొనడంతో ఒకరు మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి.
దళిత డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో రాజమండ్రి ప్రత్యేక కోర్టులో రెండో రోజు విచారణ కొనసాగుతోంది. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఈరోజు కోర్టుకు హాజరయ్యారు.
కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం గోనేడు గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. నవవధువు సత్యంశెట్టి వెంకటలక్ష్మి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
కాకినాడ రూరల్ మండల పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక ప్రయాణికుడు అక్కడికక్కడే మరణించాడు. మరో 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గ విద్యార్థులకు శుభవార్త తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి పరీక్షల్లో 580కి పైగా మార్కులు సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్య అందించేందుకు చర్యలు ప్రారంభించారు.