Share News

‘తూర్పు’ దూకుడు

ABN , Publish Date - Jan 13 , 2026 | 01:50 AM

ప్రభుత్వ పథకాలు అమలులోనూ, లక్ష్యాలు సాధించడంలో జిల్లా పలు రంగాల్లో ముందు ఉంది. ప్రజలకు అవగాహన పరచడంలోనూ, వారికి సంతృప్తి కలిగించడంలో ఘనమైన స్థా నాలు జిల్లాకు దక్కాయి. ఈనెల 12వ తేదీ వర కూ కూడా రియల్‌ టైమ్‌ గవర్నెస్‌ ద్వారా ఐవీ ఆర్‌ఎస్‌ ద్వారా సేకరించిన ప్రజల సంతృప్తి, అసంతృప్తి స్థాయిల వివరాలను ప్రభుత్వం ప్రక టించింది.

‘తూర్పు’ దూకుడు

  • సేవల రంగంలో జిల్లాకు గ్రేడ్‌ ఏ+ ర్యాంకు

  • ప్రజల సంతృప్తి పొందిన టాప్‌ 5లో జిల్లాకు స్థానం

  • పట్టాదారు పాస్‌ పుస్తకాలు పంపిణీలో టాప్‌ స్కోర్‌

  • వాటర్‌ సప్లయ్‌, వాహన్‌ సేవ, ఏపీపీసీబీ, హౌసింగ్‌ సేవల్లో టాప్‌ 5 జిల్లాల్లో జిల్లాకు మొదటి స్థానం

(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వ పథకాలు అమలులోనూ, లక్ష్యాలు సాధించడంలో జిల్లా పలు రంగాల్లో ముందు ఉంది. ప్రజలకు అవగాహన పరచడంలోనూ, వారికి సంతృప్తి కలిగించడంలో ఘనమైన స్థా నాలు జిల్లాకు దక్కాయి. ఈనెల 12వ తేదీ వర కూ కూడా రియల్‌ టైమ్‌ గవర్నెస్‌ ద్వారా ఐవీ ఆర్‌ఎస్‌ ద్వారా సేకరించిన ప్రజల సంతృప్తి, అసంతృప్తి స్థాయిల వివరాలను ప్రభుత్వం ప్రక టించింది. 20140-15 నుంచి 2024-25 వరకూ వివిధ ప్రాజెక్టులు, సెక్టార్ల ప్రకారం గ్రాస్‌ స్టేట్‌ డొమెస్టిక్‌ ప్రొడక్ట్‌ (జీఎస్‌డీపీ), కీ పెరఫార్మెన్స్‌ ఇండికేటర్ల(పీసీఐ), జీవీఏ వివరాలను జిల్లావా రీ ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాక 2025- 26కి సంబంధించిన భారత జీడిపిని అడ్వాన్స్‌ అంచనాలను కూడా వివరించింది. స్వర్ణాంధ్ర - 2047కి సాధించాల్సిన లక్ష్యాలను నిర్దేశించింది. ముఖ్యంగా 2025-26లో వాటి లక్ష్యాలు, ఇంత వరకూ సాధించిన వివరాలను వివరించింది. అందులో సేవల రంగంలో జిల్లాకు 9 ఇండికేట ర్లతో 90 స్కోర్‌తో గ్రేడ్‌ ఏ+ సాధించింది. ఇక రాష్ట్రంలో ఏ జిల్లాలకు ఈ స్థానం దక్కకపోవ డం గమనార్హం. పరిశ్రమల రంగంలో 5 ఇండి కేటర్లతో 76 స్కోర్‌తో ఏ గ్రేడ్‌ను పొందింది. వ్య వసాయం, దాని అనుబంధ రంగాల్లో 40 ఇం డికేటర్లతో 84 స్కోర్‌తో ఏ గ్రేడ్‌ స్థానంలో ఉంది. వివిధ డిపార్టమెంట్లలో నిర్దేశించిన పనులను 100శాతం పూర్తిచేసిన నాలుగు జిల్లాలో ఒక జిల్లాగా తూర్పుగోదావరికి స్థానం దక్కింది. ఇక జిల్లాల పునర్వవ్యవస్థీకరణలో 19 మండలాల నుంచి 22 మండలాలకు జిల్లా పెరిగిందని, దీంతో జిల్లా విస్తీర్ణం 2,823 చదరపు కిలోమీట ర్లుగా ప్రభుత్వం స్పష్టం చేసింది.

  • హౌసింగ్‌ సేవల్లో టాప్‌-1

వివిధ రంగాల్లో పబ్లిక్‌ పాజిటివ్‌ అవగాహనకు సంబంధించి సంతృప్తి పొందడంలో జిల్లా మంచి స్థానంలో ఉంది. రా ష్ట్రస్థాయిలో పలురంగాల్లో సంతృత్తి స్కోర్‌ సాధించిన టాప్‌-5 జిల్లాల్లో తూర్పుగోదావరి స్థానం దక్కిం చుకోవడం గమనార్హం. రియల్‌టైం గవర్నెస్‌ సిబ్బంది ఐవీఆర్‌ఎస్‌ ద్వారా ప్రజల సంతృప్తి, అసంతృప్తులను సేకరిస్తున్న సంగతి తెలిసిందే. అందులో జిల్లాకైతే సంతృప్తిస్థానాలు పొందిన ఐదు జిల్లాలో ఒకటోస్థానం పలు రంగాల్లో లభించింది. వాస్తవానికి పట్టాదారుపాస్‌ పుస్త కాల పంపిణీ, ఉచితంగా ఇవ్వడం వంటి అంశా ల్లో జిల్లాకు ఎక్కువ స్కోర్‌ లభించింది. 71.9 శాతం పాజిటివ్‌, 28.1శాతం నెగిటివ్‌గా ఉంది. మంచినీటిని నాణ్యతగా సరఫరా చేయడంలో జిల్లాకు టాప్‌-5లో 1వ స్థానం లభించింది. 79.9 శాతం పాజిటివ్‌గానూ, 20.1 శాతం నెగిటివ్‌ గానూ స్పందన ఉంది. రాష్ట్ర పొల్యూషన్‌ కంట్రో లు బోర్డ్‌ విషయంలో అవినీతి లేకపోవడం, సేవల సంతృప్తి, వంటి అంశాల్లో జిల్లా నంబర్‌ 1 స్థానంలో ఉంది. హౌసింగ్‌శాఖపరంగా బిల్లుల క్లియరెన్స్‌, సిబ్బంది సహకారం, బిల్లుల మం జూరులో సమస్యలు ఎదుర్కోవడం వంటి విష యాల్లో జిల్లాకు సంతృప్తిలో టాప్‌-5లో మొదటి స్థానం లభించింది. వాహన్‌ సేవలు విషయంలో వాహన్‌ పోర్టల్‌లో రిజిస్ర్టేన్‌ సంృప్తి, రిజిస్ర్టేషన్‌ కు అదనంగా చార్జీల వంటి అంశాల్లో జిల్లాకు నంబర్‌ 1స్థానం లభించింది. పెన్షన్లు పంపిణీలో జిల్లాకు 5వ స్థానం లభించింది. దీపం-2 పథకం విషయంలో డెలివరీ బాయ్స్‌ ప్రవర్తన, అద నంగా డబ్బు వసూలు చేయడం వంటి సం తృప్తి విషయాల్లో జిల్లాకు టాప్‌-5లో 2వస్థానం వచ్చింది. ఆర్టీసీ బస్సు సేవల్లో టాప్‌ ఫైవ్‌లో నూ, బాటమ్‌-5లో కూడా జిల్లాకు స్థానం లేదు. సాధారణ స్థాయి లభించింది. రేషన్‌ పంపిణీ లో నెలవారీ తీసుకోవడం, సరుకు నాణ్యత విష యంలో సంతృప్తి పొందిన వారి విషయంలో జిల్లాకు టాప్‌-5లో మూడవ స్థానం లభించిం ది. పంచాయతీ సేవల విషయంలో డోర్‌డోర్‌ చెత్త సేకరణ, వారంలో కనీసం రెండు రోజులు సేకరించిన విషయాలలో జిల్లాకు 3వ స్థానం లభించింది. ఆసుపత్రుల సేవల విషయంలో వైద్యుల అందుబాటు, ఉచితంగా మందులు ఇవ్వడం, అవినీతి లేకపోవడం, శుభ్రత ఉండ డం వంటి విషయాలలో జిల్లాకు 5వస్థానం లభించింది. అన్నాక్యాంటీన్ల నిర్వహణలో జిల్లాకు టాప్‌-5, బాటమ్‌-5లో కూడా స్థానం లేదు. ఇక్క డ సాధారణ స్థానమే లభించడం గమనార్హం. దేవాలయాలు, ఫెసిలిటీస్‌ విషయంలో దర్శనం పట్ల సంతృప్తి, అక్కడి సౌకర్యాలు మెరుగు, తాజా, రుచికరమైన ప్రసాదం, శుభ్రత, విషయా ల్లో కూడా జిల్లాకు ప్రధాన స్థానంగానీ, అథమ స్థానంగానీ లేదు. విద్యుత్‌ రంగానికి సంబంధిం చి విద్యుత్‌ అంతరాయం లేకపోవడం, ఓల్టేజీ హెచ్చుతగ్గుల సమస్య, సిబ్బంది అందుబాటులో ఉండడం అంశాల్లో 5వస్థానం లభించింది.

  • గంజాయి అరికట్టడంలో ఐదో స్థానం

గంజాయ్‌, డ్రగ్స్‌ నిర్మూలన అంశాల్లో డ్రగ్స్‌ సమస్యలు, పోలీసుల స్పందన, పబ్లిక్‌ స్థలాల్లో అమ్మడం, వినియోగించడం, నిర్మూలన వంటి అంశాల్లో ఉన్న 5 స్థానాల్లో 5వదిగా జిల్లా ఉండ డం గమనార్హం. ఇక్కడ 69.5 శాతం పాజిటి వ్‌గా, 30.5శాతం నెగిటివ్‌గానూ ఉంది. మహి ళలపట్ల నేరాల విషయంలో పబ్లిక్‌ స్థలాల్లో హెరాస్‌మెంట్‌, పోలీసుల స్పందన, భద్రత అవగాహన కార్యక్రమాల విషయంలో జిల్లాకు 4వ స్థానం లభించింది. 68.3శాతం పాజిటివ్‌గా ఉండగా, 31.7శాతం నెగిటివ్‌గా ఉన్నారు. రిజి స్ర్టేషన్‌ సేవల రంగంలో ఆన్‌లైన్‌ సేవలు అంగీ కరించడం, స్టాఫ్‌ ప్రవర్తన, స్లాట్‌ బుకింగ్‌ ప్రోగెస్‌, అనధికార వసూళ్లు వంటి అంశాల్లో కూడా టాప్‌, బోటమ్‌ స్థానాల్లో లేదు. ఇక్కడ సాధారణ స్థానంలోనే ఉంది. రెవెన్యూ సర్వీసుల విషయంలో అదనంగా డబ్బు వసూలు చేయడం, గుర్తించిన విషయాలు, ఫీల్డ్‌ ఎంక్వయరీ పూర్తి చేయడం, ఆర్డర్‌ కాపీ ఇవ్వడం, విఆర్వోల సంత కాలు వంటి విషయాల్లో జిల్లాకు 3వ స్థానం లభించింది. 52శాతం పాటిటివ్‌గానూ, 47.6శాతం నెగిటివ్‌గానూ ఉంది. ఇసుక విషయంలో తక్కువ ధరకు సరఫరా కేంద్రాలు, ఇసుక అందుబాటులో ఉండడం, నిర్మాణ పనులకు ఉపయోగపడడం వంటి అంశాల్లో జిల్లాకు మూడోస్థానం లభించింది. 71.3శాతం పాటిజిట్‌గానూ, 28.7శాతం నెగిటివ్‌ గానూ ఉంది. ప్రభుత్వ ఆసుపత్రుల డీఎంఈ సేవ ల విషయంలో ఓపీలో వైద్యుల అందుబాటు, ఉచిత మందులు, అవినీతి, శుభ్రత వంటి అంశా ల్లో జిల్లాకు రెండో స్థానం వచ్చింది. 73.6శాతం మంది పాజిటివ్‌గానూ, 26.4శాతం మంది నెగి టివ్‌గానూ స్పందించారు. గ్రామ, వార్డు సెక్రటరీల సేవల విషయంలో ఆఫీసు వేళల్లో ఉద్యోగులు అందుబాటులో ఉండడం, వారి ప్రవర్తన, అక్రమ వసూళ్ల వంటి విషయాల్లో జిల్లాలో సంతృప్తి స్థానంలో మూడో స్థానం లభించింది. ఇరిగేషన్‌ శాఖకు సంబంధించిన పొలాలకు సరిపడ నీరు అందివ్వడం, అవసర సమయాల్లో నీటిని సరఫరా చేయడం వంటి అంశాల్లో జిల్లాకు 5వ స్థానం లభించింది. బీసీ సంక్షేమశాఖపరంగా మెనూ ప్రకారం భోజనాలు పెట్టడం, వార్డెన్ల పెరఫార్మెన్స్‌ సంతృప్తి, వసతి గృహాలలో వాటర్‌, శానిటేషన్‌ పరిస్థితుల్లో జిల్లాకు 5వ స్థానం లభించింది. పాఠశాల విద్యారంగంలో టీచర్లు రోజూ రావడం, పాఠాలు కఠినంగా చెప్పడం, భవనాలు, గదులు భద్రత, పాఠాలు బాగా చెప్పడం వంటి అంశాల్లో జిల్లాకు 3వ స్థానం లభించింది. 84.2శాతం పాజి టివ్‌గానూ, 15.8 శాతం నెగిటివ్‌గానూ ఉంది. మధ్యాహ్న భోజన పథకం విషయంలో 3నుంచి 6 ఏళ్ల విషయంలో అంగన్‌వాడీ కేంద్రాల పనితీరు, పాలు, గుడ్లు రోజూ ఇవ్వడం, మంచినీరు అందు బాటులో ఉండడం, టాయిలెట్లు శుభ్రంగా ఉండ డం వంటి విషయాల్లో జిల్లాకు 4వ స్థానం లభించింది. స్ర్టీట్‌ లైట్ల విషయంలో జిల్లాకు 4వ స్థానం లభించింది. 75.2శాతం పాజిటివ్‌గానూ, 24.8శాతం, నెగిటివ్‌గానూ స్పందన ఉంది.

Updated Date - Jan 13 , 2026 | 01:50 AM