Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. 30 ఇళ్లు దగ్ధం..
ABN , Publish Date - Jan 12 , 2026 | 07:21 PM
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలి పదుల సంఖ్యలో ఇళ్లు దగ్ధమయ్యాయి.
కాకినాడ, జనవరి 12: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రౌతులపూడి మండలం సారలంకలో ఘోర ప్రమాదం జరిగింది. గ్యాస్ సిలిండర్ పేలి దాదాపు 30 ఇళ్లు దగ్ధమయ్యాయి. దీంతో స్థానికులు వెంటనే స్పందించి.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక శకటాలు.. ఘటనా స్థలానికి చేరుకునే సరికే ఇళ్లన్ని పూర్తిగా కాలిపోయాయి. దాంతో పలు కుటుంబాలకు చెందిన ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇంటి సామగ్రి మెుత్తం కాలి బూడిద కావడంతో బోరున విలపిస్తున్నారు. ఈ మంటల్లో సంక్రాంతి పండగ కోసం తెచ్చుకున్న దుస్తులు, కొత్త వస్తువులు సైతం కాలిపోయాయి. పండగ వేళ ఇలాంటి పరిస్థితి రావడంతో బాధితులంతా కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ వెంటనే సారలంక గ్రామానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ అగ్నిప్రమాద ఘటనపై ఉన్నతాధికారులకు ఎమ్మెల్యే వివరించారు. పరిస్థితిని సమీక్షించిన స్థానిక ఎమ్మెల్యే.. నిరాశ్రయులకు పునరావాసం కోసం ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ గ్యాస్ సిలిండర్ పేలుడులో ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో.. అంతా ఊపిరిపీల్చుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నారావారిపల్లికి చేరుకున్న సీఎం చంద్రబాబు
దివ్యాంగులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి..
Read Latest AP News And Telugu News