Sankranti Celebrations: నారావారిపల్లికి చేరుకున్న సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Jan 12 , 2026 | 06:54 PM
సంక్రాంతి వేడుకలకు నారావారిపల్లి ముస్తాబు అయింది. సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం సాయంత్రం తన స్వగ్రామానికి చేరుకున్నారు.
చిత్తూరు, జనవరి 12: సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఆయన స్వగ్రామం నారావారిపల్లికి చేరుకున్నారు. రాజధాని అమరావతి నుంచి హెలికాఫ్టర్‌లో ఆయన స్వగ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు జిల్లా ఉన్నతాధికారులతోపాటు స్థానిక నేతలు, పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్దఎత్తున ఘనస్వాగతం పలికారు. ఇక ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ఈ రోజు ఉదయమే సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి ఈ గ్రామానికి చేరుకున్నారు.
అలాగే నందమూరి బాలకృష్ణ ఫ్యామిలీ సైతం ఇప్పటికే నారావారిపల్లికి విచ్చేసింది. నందమూరి రామకృష్ణ, బాలకృష్ణ చిన్న అల్లుడు, విశాఖ ఎంపీ ఎం.భరత్ సైతం నారావారిపల్లికు చేరుకున్నారు. నారా, నందమూరి ఫ్యామిలీలు చేరుకోవడంతో.. సీఎం స్వగ్రామానికి కొత్త శోభ వచ్చింది. సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఆయన స్వగ్రామంతోపాటు పరిసర గ్రామాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
ప్రతి ఏటా సంక్రాంతి పండగను నారా, నందమూరి ఫ్యామిలీలు ఈ నారావారిపల్లిలో జరుపుకోవడం అనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. ఈ పండగ సందర్భంగా గ్రామ దేవత నాగాలమ్మను ఈ ఇరు కుటుంబాలు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అలాగే తల్లిదండ్రుల సమాధులను సైతం చంద్రబాబు సందర్శించుకొని వారికి ఘన నివాళులు అర్పిస్తుంటారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పండగ వేళ.. ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు
దివ్యాంగులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి..
Read Latest AP News And Telugu News